Share News

Hyderabad CP: అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌పై హైదరాబాద్ సీపీ రియాక్షన్

ABN , Publish Date - May 06 , 2024 | 02:31 PM

Telangana: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్‌పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫేక్ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్‌పై అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం 27 కేసులు నమోదు చేసినట్లు తెలపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసామని... వారు కండిషన్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్, లాప్టాప్స్ సీజ్ చేశామన్నారు.

Hyderabad CP: అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌పై హైదరాబాద్ సీపీ రియాక్షన్
Hyderabad CP Kothakota Srinivas Reddy

హైదరాబాద్, మే 6: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ( Union Minister Amit Shah) వీడియో మార్ఫింగ్‌పై (video morphing Case) హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy ) స్పందించారు. ఫేక్ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్‌పై అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం 27 కేసులు నమోదు చేసినట్లు తెలపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసామని... వారు కండిషన్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు చెప్పారు.

AP Elections: నెక్స్ట్ వికెట్ సీఎస్ జవహర్ రెడ్డేనా.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!!


వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్, లాప్టాప్స్ సీజ్ చేశామన్నారు. ట్విట్టర్‌కు లెటర్ పెట్టి వివరాలు తెలుసుకున్నామని చెప్పారు. మొదట ఇక్కడ నుంచే స్టార్ట్ అయినట్లు వివరాలు వచ్చాయని.. దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు తమను కలిశారని.. ఇక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్ డీటెయిల్స్ అడిగారన్నారు. వారికి కావలసిన వివరాలు అందించామని వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

Pawan Kalyan: పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు


ఫోన్ ట్యాపింగ్ కేసుపై...

అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఆయన మాట్లడుతూ.. కేసు దర్యాప్తులో ఉందని.. అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తామని చెప్పారు. అందుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నామన్నారు. ఈ కేసులో నిందితులు ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా.. తాము కష్టపడి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు అధికారులు, నాయకులు చట్టానికి ఎవరైనా సమానమే అని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు

Bhatti Vikramarka: షెడ్ నుంచి కారు ఇక బయటకు రాదంతే.. బీఆర్‌ఎస్‌‌పై భట్టి కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 02:44 PM