Share News

Viral Video: ఇరాన్‌లో చేపల వర్షం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.. దీని వెనుకున్న కారణమేంటి?

ABN , Publish Date - May 06 , 2024 | 02:19 PM

ఆకాశం నుంచి వర్షపు నీటితో పాటు చేపలు పడడాన్ని మీరెప్పుడైనా స్వయంగా చూశారా? ఇరాన్ వాసులకు తాజాగా ఆ అనుభవం కళ్ల ముందు నిలిచింది. ప్రస్తుతం ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా యాసుజ్ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు చేపలు కూడా ఆకాశం నుంచి కింద పడ్డాయి.

Viral Video: ఇరాన్‌లో చేపల వర్షం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.. దీని వెనుకున్న కారణమేంటి?
Fish rain

ఆకాశం నుంచి వర్షపు నీటితో పాటు చేపలు పడడాన్ని మీరెప్పుడైనా స్వయంగా చూశారా? ఇరాన్ (Iran) వాసులకు తాజాగా ఆ అనుభవం కళ్ల ముందు నిలిచింది. ప్రస్తుతం ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా యాసుజ్ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు చేపలు (Fish rain) కూడా ఆకాశం నుంచి కింద పడ్డాయి. ఆ దృశ్యం చూసి అందరూ షాకయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (Viral Video).


చేపల వర్షానికి సంబంధించిన ఆ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది ఈ వీడియోను చూసి షాకవుతున్నారు. ఈ తరహా చేపల వర్షాలు ఇంతకు ముందు కూడా పలు చోట్లు కురిశాయి. ఈ చేపల వర్షం వెనుకున్న కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఆ చేపలు ఆకాశం నుంచి పడవు. అసలు కథేంటంటే.. భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు వస్తాయి. ఆ సుడిగాలులు సముద్ర, నదీ, సరస్సుల జలాలనూ, వాటిల్లో నివసించే చేపల్నీ గిరగిరా తిప్పుతూ పైకి తీసుకుపోతాయి.


ఆ గాలులు, మేఘాలతోపాటు చేపలు కూడా ఆకాశంలో కొన్ని కిలోమీటర్లు వెళ్తాయి. ఆ సుడిగాలి భూమి పైకి వచ్చి వర్షం కురుస్తుంది. దాంతో చేపలన్నీ భూమిపై పడతాయి. ముఖ్యంగా భారీ తీర ప్రాంతం ఉండి, టోర్నడోలు, సుడిగాలులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఈ చేపల వర్షం ఎక్కువగా పడుతుంటుంది. మన భారతదేశంలో కూడా అరుదగా ఈ చేపల వర్షం కురుస్తుంటుంది. హోండరూస్ దేశంలో అయితే ఈ చేపల వర్షం సర్వ సాధారణం.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తేడాగా ఉన్నకారు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!


Viral: రెస్టారెంట్ పొరపాటు.. రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్న మహిళ.. పనీర్ శాండ్‌విచ్ ఆర్డర్ చేస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2024 | 02:19 PM