Home » Fake videos
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ క్రైమ్‌కు ప్రధాన కారణంగా మారిన సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లపై దృష్టిపెట్టింది.
అమరావతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఫేక్ పోస్టులకు అడ్డుకట్ట పడడంలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియోను వైసీపీ మూకలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలాంటి సర్వే నిర్వహించలేదు.
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి టీపీసీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అమిత్ షా వీడియో మార్కింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల వేధింపులపై కోర్టు దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారు.
Telangana: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్‌పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫేక్ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్‌పై అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం 27 కేసులు నమోదు చేసినట్లు తెలపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసామని... వారు కండిషన్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్, లాప్టాప్స్ సీజ్ చేశామన్నారు.
కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నకిలీ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై హైగ్రౌండ్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Telangana: కేంద్రహోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈకేసులో TPCC సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. పది వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు అయ్యింది.
ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రేస్ గార్సియా ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో వీడియోను పోస్ట్ చేశారని గుర్తించారు.
YSRCP Fake Propaganda : ‘ఫేక్ ప్రచారానికి కాదేది అనర్హం’ అన్నట్లుగా అధికార వైసీపీ (YSR Congress) ప్రవర్తిస్తోంది..! సోషల్ మీడియాను (Social Media) అడ్డుపెట్టుకుని చిల్లర పనులు చేస్తోంది..! ఏం చేసినా సరే జనాల్లోకి వెళ్లిపోతుందని.. వైఎస్ జగన్ (YS Jagan) అండ్ కో ఇష్టానుసారం రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇక అడ్డు అదుపూ లేకుండా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను వాడేస్తోంది వైసీపీ.
హైదరాబాద్: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫేక్ ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని...