Share News

VH: రేవంత్.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోకు!

ABN , Publish Date - Mar 23 , 2024 | 02:47 PM

Telangana: రాష్ట్రంలో బీఆర్ఎస్ పీడ పోయిందని ఒకప్పుడున్న సీఎం రేవంత్.. ఇప్పుడు ఏం మాట్లాడటంలేదని వీహెచ్ అన్నారు. ఈ విషయంపై రేవంత్‌ను కలిసి చెబుతామంటే తనకు టైమ్ ఇవ్వడం లేదని అన్నారు. తక్కువ సమయంలో సీఎం అయింది రేవంత్ రెడ్డి ఒక్కడే అని చెప్పుకొచ్చారు. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ ఒకింత అసంతృప్తి వెలిబుచ్చారు.

VH: రేవంత్.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోకు!

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై (Telangana CM Revanth Reddy) కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (Congress Senior Leader V.Hanumanth Rao) ఓ వైపు.. అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. మరోవైపు సలహాలు, సూచనలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ మరీ మీడియా ముందుకొచ్చారు వీహెచ్. ఇంతకీ రేవంత్ గురించి వీహెచ్ ఏమన్నారు..? పదే పదే ఈ ఇద్దరి మధ్య పొరపచ్చాలు వస్తున్నాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Breaking: కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగింపు

ఇంతకీ ఏం జరిగింది..?

రాష్ట్రంలో బీఆర్ఎస్ పీడ పోయిందని ఒకప్పుడున్న సీఎం రేవంత్.. ఇప్పుడు ఏం మాట్లాడటంలేదని వీహెచ్ అన్నారు. ఈ విషయంపై రేవంత్‌ను కలిసి చెబుతామంటే తనకు టైమ్ ఇవ్వడం లేదని అన్నారు. తక్కువ సమయంలో సీఎం అయింది రేవంత్ రెడ్డి ఒక్కడే అని చెప్పుకొచ్చారు. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ ఒకింత అసంతృప్తి వెలిబుచ్చారు. బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారన్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్ క్యాడర్‌కు న్యాయం చేయకుండా.. కార్యకర్తలపై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా డబ్బు సంపాదించి ఇప్పుడు అధికారంలో ఉన్నామని కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో పనిచేసిన చాలా మంది నేతలు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో కారెక్కి.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేతలను దృష్టిలో పెట్టుకుని వీహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

Smart Phone: రూ.8 వేలకే 50 మెగా పిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్


ఇటు చూడు రేవంత్!

రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ మాత్రమే వినొద్దని.. రెండు సైడ్స్ వినాలని వీహెచ్ కోరారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని వినతి చేశారు. ‘‘నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు.. ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది నా ఆవేదన.. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి.. నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలి.. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదు.. నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావు’’ అంటూ వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చూస్తే.. రేవంత్‌కు సలహాలు, సూచనలు ఇస్తూనే.. కాస్త అసంతృప్తి అంతకుమించి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు వీహెచ్. దీనిపై హైకమాండ్.. మరీ ముఖ్యంగా రేవంత్ ఎలా రియాక్టవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

Kavitha: ఎమ్మెల్సీ కవితకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కోర్టు!

TDP MP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే.. కానీ ఏపీలో అంతకంటే...


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 03:18 PM