Share News

Kavitha: ఎమ్మెల్సీ కవితకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కోర్టు!

ABN , Publish Date - Mar 23 , 2024 | 02:22 PM

Kavitha ED Custody: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాసింత రిలీఫ్ దక్కింది. ఓ వైపు వరుస ఈడీ సోదాలు.. మరోవైపు కస్టడీలో విచారణతో సతమతం అవుతున్న కవిత..

Kavitha: ఎమ్మెల్సీ కవితకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కోర్టు!

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) కాసింత రిలీఫ్ దక్కింది. ఓ వైపు వరుస ఈడీ సోదాలు.. మరోవైపు కస్టడీలో విచారణతో సతమతం అవుతున్న కవిత కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి అనుమతివ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. అది కూడా పది నిమిషాలు మాత్రమే సమయం అడిగారు కవిత. ఇందుకు స్పందించిన కోర్టు ఓకే అని చెప్పింది. ఇవాళ కస్టడీ ముగిసిన తర్వాత కవితను ఈడీ అధికారులు.. కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. మూడ్రోజులకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ క్రమంలో కవిత 10 నిమిషాలపాటు పిల్లలతో మాట్లాడి అనంతరం ఈడీ కస్టడీకి వెళ్లారు. ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి.. ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

Breaking: కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగింపు



Kavitha-ED-Enquiry-Latest-1.jpg

నిన్న.. ఇవాళ ఇలా!

అంతకుముందే.. కవితను చూసేందుకు ఆమె భర్త అనిల్, ఇద్దరు కుమారులు రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. బీఆర్ఎస్ నేతలు కూడా కోర్టు వద్దకు వచ్చారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, పలువురు జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. ఈ క్రమంలో కవిత కోర్టు అనుమతి అడగటం, మాట్లాడటం రెండూ అయిపోయాయి. మరోవైపు.. శుక్రవారం రాత్రి కవిత కుమారుడు ఆర్య, కవిత కుటుంబ సభ్యులు, ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లి.. కవితను కలిశారు. ఇవాళ మరోసారి మాట్లాడాలని కవిత కోరడంతో కోర్టు ఓకే చెప్పడం జరిగింది.

Kavitha-Daughter.jpg

కవితకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 02:22 PM