Share News

TDP MP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే.. కానీ ఏపీలో అంతకంటే...

ABN , Publish Date - Mar 23 , 2024 | 01:51 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులపై టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ చిన్న స్కాం అని.. ఏపీ లిక్కర్‌లో ఇంతకన్నా పెద్ద స్కాం జరగుతోందని ఆరోపించారు. ఏపీలో లిక్కర్ అమ్మకాలల్లో డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకోవడం లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని.. జగన్ జీవితాంతం జైల్లో ఉన్న ఆయనపై ఉన్న కేసులు సరిపోవంటూ వ్యాఖ్యలు చేశారు.

TDP MP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే.. కానీ ఏపీలో అంతకంటే...

న్యూఢిల్లీ, మార్చి 23: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy), మంత్రులపై టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ (TDP MP Kanakamedala Ravindra Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ చిన్న స్కాం అని.. ఏపీ లిక్కర్‌లో ఇంతకన్నా పెద్ద స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో (Andhrapradesh) లిక్కర్ అమ్మకాలల్లో డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకోవడం లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని.. జగన్ జీవితాంతం జైల్లో ఉన్న ఆయనపై ఉన్న కేసులు సరిపోవంటూ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలో (AP Government) అన్ని స్కాం లే అని.. సీబీఐ విచారణ జరిపితే జగన్మోహన్ రెడ్డి, వారి మంత్రులు జైల్లో ఉంటారంటూ టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

MLC Kavitha: తప్పుడు కేసు పెట్టారు.. న్యాయపరంగా పోరాడుతా: ఎమ్మెల్సీ కవిత


ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే....

విశాఖపట్నం పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుకున్నారని.. ఈ అంశంపై ఇప్పుడు ఏపీలో తీవ్రమైన చర్చ జరగుతోందని టీడీపీ ఎంపీ అన్నారు. విచారణను అడ్డుకునే విధంగా స్థానిక అధికారులు పాల్పడ్డారని సీబీఐ రిపోర్టులో పేర్కొందన్నారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయినందుకు విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారని... అసలు బ్రెజిల్‌కు వైసీపీ ఎంపీకి ఉన్న సంబంధం ఏంటి? దీనికి లింకు ఏంటి? అని ప్రశ్నించారు. కూనం వీరభద్రరావు అనే వ్యక్తి బీజేపీ, టీడీపీ కుమ్మకయ్యారని ఆరోపణలు చేశారని.. సంధ్య అక్వా ఎక్స్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కూనం వీరభద్రరావు ది అని చెప్పుకొచ్చారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరును ఇందులో తీసుకొచ్చారని మండిపడ్డారు. అసలు బ్రెజిల్ నుంచి డ్రగ్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వ సహకారం లేకుండా డ్రగ్స్ విశాఖపట్నంకు రాగలవా అని నిలదీశారు. ఈస్ట్ డ్రైడ్ పేరుతో కొకైన్ తెప్పించే స్థోమత సంధ్య ఆక్వాకు ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కూనం వీరభద్ర రావు పేరును ముందు పెట్టారన్నారు. డ్రగ్స్‌లో 6 రకాల మాదకద్రవ్యాలు వచ్చాయని తెలిపారు. వైసీపీ, ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

Smart Phone: రూ.8 వేలకే 50 మెగా పిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్


గతంలో ముద్ర పోర్టులో డ్రగ్స్ దొరికితే దాని మూలాలు ఏపీలో దొరికాయని గుర్తుచేశారు. ఏపీ డ్రగ్స్, గంజాయిలో ముందు వరసలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారన్నారని.. ఇది ప్రభుత్వం వైఫల్యం అని విమర్శలు గుప్పించారు. ఏపీ లిక్కర్‌లో డ్రగ్స్ కలుపుతున్నారని పెద్ద ఎత్తున్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఏపీలోని మద్యం దుకాణాల్లో కొన్ని బాటిల్స్ తీసుకొని టెస్ట్ చేయాలని.. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఉన్న మద్యం చీప్ లిక్కర్ తాగి ప్రజల ఆరోగ్యాలు చేడిపోతున్నాయని.. దీనిపై ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలన్నారు. ఏపీలో మద్యపానం నిషేధం చేస్తామన్నారు.. ఏమైంది అని ప్రశ్నలు కురిపించారు. రాష్ట్రంలో యధేచ్చగా వాలంటీర్లు ఎన్నికల్లో పని చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నామని కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Breaking: కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగింపు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 01:51 PM