Share News

CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన రేవంత్.. ఇవాళ తేల్చేస్తారట..

ABN , Publish Date - Apr 01 , 2024 | 07:17 AM

సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు. నిజానికి మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. నేటి సాయంత్రం సీఈసీ మీటింగ్‌లో రేవంత్ పాల్గొననున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది. సీఏం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు.

CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన రేవంత్.. ఇవాళ తేల్చేస్తారట..

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హస్తినకు బయలుదేరారు. నిజానికి మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. నేటి సాయంత్రం సీఈసీ మీటింగ్‌ (CEC Meeting)లో రేవంత్ పాల్గొననున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం (AICC Office)లో సీఈసీ భేటీ కానుంది. సీఏం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై చర్చించనున్నారు.

Phone Tapping Case: ప్రభాకర్‌రావు లొంగు‘బాట’?

వరంగల్ నుంచి కడియం కావ్య కి టికెట్ కన్ఫర్మ్ చేయనున్నారు. ఖమ్మం టికెట్ కోసం ముగ్గురు మంత్రులు ప్రయత్నాలు సాగించనున్నారు. మంత్రులను పక్కన పెట్టి రాజేంద్ర ప్రసాద్ లేదా లోకేష్ యాదవ్‌కి టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి సానియా మీర్జా, శేహనాజ్ తుబ్సుం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్, ప్రవీణ్ రెడ్డి పేర్లు పరిశీలించనున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మార్గంలో మార్పులు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు రోజుల క్రితం కూడా ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (Central Election Committee) సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న లోక్‌సభ స్థానాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది కానీ నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి మరో వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. నేడు జరగనున్న మీటింగ్‌లో ఈ నాలుగు స్థానాలపై క్లారిటీ రానుంది.

ఎన్టీపీసీ ‘రెండో దశ’తో ఒప్పందానికి నో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 07:32 AM