Share News

KTR: రైతులను విస్మరించి రాజకీయాలపైనే సర్కార్ దృష్టి

ABN , Publish Date - May 15 , 2024 | 02:48 PM

Telangana: రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తరుగు పేరుతో క్వింటాల్‌కు మూడు కేజీలు తీస్తున్నారని..

KTR: రైతులను విస్మరించి రాజకీయాలపైనే సర్కార్ దృష్టి
BRS Working President KTR

హైదరాబాద్, మే 15: రాష్ట్ర ప్రభుత్వం రైతులను (Farmers) విస్మరించి రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working Prsident KTR) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వం (Telangana Government) నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తరుగు పేరుతో క్వింటాల్‌కు మూడు కేజీలు తీస్తున్నారని.. రైతులకు అన్యాయం చేయొద్దని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ (BRS) రోడ్డెక్కి ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నాలుగు సార్లు బీఆర్ఎస్ మాత్రమే గెలిచిందని తెలిపారు. కేసీఆర్‌కు బలాన్ని చేకూర్చేలా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

AP Elections: అంతలోనే మాట మారింది..?


మెగా డీఎస్సీ దగా అయిందన్నారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తానే ఇచ్చినా అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ప్రశ్నించే గొంతు.. పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. ఒక బ్లాక్ మెయిలర్‌ను కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టిందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నల్గొండలో నయీమ్ లాంటి వ్యక్తిని తయారు చేసినవాళ్ళం అవుతామన్నారు. ఉద్యోగులను ముఖ్యమంత్రి నిందించటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి దిక్కుమాలిన మాటలు మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి


నారాయణ ఖేడ్‌లో టీచర్లపై లాఠీ ఛార్జ్ చేస్తారా అంటూ మండిపడ్డారు. మూడు లక్షల ఎనభై కోట్ల అప్పు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని రిజర్వ్ బ్యాంకు నివేదిక రిలీజ్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేస్తోందన్నారు. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారన్నారు. హైదారాబాద్ విషయంలో బీజేపీ ఏం చేయబోతుందో జూన్ 4 తర్వాత తెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections 2024: ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

Youtube: బ్యాంక్‌ దోపిడీ ఎలా చేయాలి...? యూట్యూబ్‌ చూస్తూ చోరీకి యత్నం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2024 | 02:53 PM