Share News

AP Higher Education Council Chairman: రేపటి నుంచి ఏపీ ఈఏపీసెట్ పరీక్ష

ABN , Publish Date - May 15 , 2024 | 01:08 PM

రేపటి నుంచి ఏపీ ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఏపీ ఈఏపీ సెట్ 2024ను బైపీసీకి మే 16 నుంచి 17 వరకూ ఐదు సెషన్‌లలో నిర్వహించనున్నారు. ఎంపీసీ కి మే 18 నుంచి 23 వరకూ 9 సెషన్ లలో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. 142 సెంటర్‌లలో పరీక్షలు నిర్వహణ జరుగుతుందని వెల్లడించారు.

AP Higher Education Council Chairman: రేపటి నుంచి ఏపీ ఈఏపీసెట్ పరీక్ష

అమరావతి: రేపటి నుంచి ఏపీ ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఏపీ ఈఏపీ సెట్ 2024ను బైపీసీకి మే 16 నుంచి 17 వరకూ ఐదు సెషన్‌లలో నిర్వహించనున్నారు. ఎంపీసీ కి మే 18 నుంచి 23 వరకూ 9 సెషన్ లలో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. 142 సెంటర్‌లలో పరీక్షలు నిర్వహణ జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణలో ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్‌లలో సెంటర్‌లు ఏర్పాటు చేసినట్టు హేమచంద్రారెడ్డి వెల్లడించారు.

PM Narendra Modi: నేనలా అనలేదు.. హిందూ-ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ


ఎంపీసీ కోసం 2లక్షల 73 వేల8 మంది, బైపీసీ కోసం 87వేల421 మంది రెండు స్ట్రీమ్ లు కలిపి 1121 మంది పరీక్ష రాయనున్నారని హేమచంద్రారెడ్డి తెలిపారు. మొబైల్‌లు, బ్లూటూత్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని వెల్లడించారు. అర్ధగంట ముందుగానే పరీక్ష సెంటర్‌లకు అనుమతిస్తామన్నారు. ఒక్క నిముషం ఆలస్యం అయినా విద్యార్థులను అనుమతించబోమని వెల్లడించారు. జిల్లా అధికారులు, అర్టీసీకి, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని హేమచంద్రారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి...

AP Elections: నుదిటిపై గాయం.. రక్తమోడుతోన్న బెదరని ఏజెంట్

AP Elections: ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు.. ఎంతంటే?

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 01:08 PM