Share News

Hyderabad: ఓ వైపు రైళ్లు.. మరో వైపు బస్సులు.. మండుటెండలో ప్రయాణికుల అగచాట్లు..

ABN , Publish Date - Feb 21 , 2024 | 08:54 AM

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ రైల్వే, బస్సుల్లో ప్రయాణించే రెగ్యులర్ ప్యాసింజర్స్ పై కనిపిస్తోంది. మహాజాతరకు నగరం నుంచి సిటీ బస్సులను తరలించడంతో సిటీ ట్రావెలర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Hyderabad: ఓ వైపు రైళ్లు.. మరో వైపు బస్సులు.. మండుటెండలో ప్రయాణికుల అగచాట్లు..

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ రైల్వే, బస్సుల్లో ప్రయాణించే రెగ్యులర్ ప్యాసింజర్స్ పై కనిపిస్తోంది. మహాజాతరకు నగరం నుంచి సిటీ బస్సులను తరలించడంతో సిటీ ట్రావెలర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం బస్టాపుల్లో పడిగాపులు కాస్తున్నారు. తాము వెళ్లాల్సిన బస్సు ఎప్పుడొస్తుందో.. అసలు వస్తుందో రాదో తెలియక అవస్థలకు గురవుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే చేసిన ప్రకటన మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై స్పందించిన సజ్జనార్.. ప్రయాణికులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పడం కొసమెరుపు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ చేసింది. వివిధ ప్రాంతాల మధ్య నడిచే కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు సాంకేతిక కారణాలతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. గద్వాల-రాయచూరు, సికింద్రాబాద్‌-సిద్దిపేట, కాచిగూడ-కర్నూలు, కాచిగూడ-రాయచూర్‌, కాచిగూడ-మహబూబ్‌నగర్‌, మెదక్‌-కాచిగూడ, కాచిగూడ-కరీంనగర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 వేలకు పైగా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి బస్సులు బయల్దేరాయి. ప్రయాణికులను జాతరకు తీసుకెళ్తున్నాయి. దీంతో బస్‌ స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అటు రైళ్లు, ఇటు బస్సుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ సమస్య మరింత దారుణంగా ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 21 , 2024 | 08:54 AM