TG: ష్.. గప్‌చుప్! హోరా హోరీకి తెర..
ABN , Publish Date - May 12 , 2024 | 04:54 AM
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రచారానికి కర్త, కర్మ, క్రియగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ తరఫున సుడి గాలి ప్రచారం చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జన జాతర సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. మొత్తం 27 రోజుల్లో 57 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగులు సరేసరి. కొన్ని రోజుల్లో నాలుగైదు రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లోనూ పాల్గొన్నారు. మరికొన్ని సందర్భాల్లో ఒకే రోజు రాష్ట్రంతోపాటు కేరళ, కర్ణాటకల్లోనూ ప్రచారం చేశారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ల కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. రాష్ట్రంలో అనేక సభల్లో పాల్గొన్నారు.

3 వారాల హోరాహోరీ ప్రచారానికి తెర
హైలైట్‌గా నిలిచిన ‘గాడిద గుడ్డు’
సుడిగాలిని మరిపించిన సీఎం రేవంత్
మోదీ గ్యారెంటీనే బీజేపీ ట్రంపు కార్డు
తేలిపోయిన బీఆర్‌ఎస్ ప్రచారాంశాలు
హోరాహోరీకి తెర!
అంతా తానైన రేవంత్ రెడ్డి!
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రచారానికి కర్త, కర్మ, క్రియగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ తరఫున సుడి గాలి ప్రచారం చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జన జాతర సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. మొత్తం 27 రోజుల్లో 57 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగులు సరేసరి. కొన్ని రోజుల్లో నాలుగైదు రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లోనూ పాల్గొన్నారు. మరికొన్ని సందర్భాల్లో ఒకే రోజు రాష్ట్రంతోపాటు కేరళ, కర్ణాటకల్లోనూ ప్రచారం చేశారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ల కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. రాష్ట్రంలో అనేక సభల్లో పాల్గొన్నారు. ఇక, కాంగ్రెస్ తరఫున పార్టీ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. తుక్కుగూడలో రాహుల్ గాంధీ పాల్గొన్న సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.. చివరి రోజు శనివారం ప్రియాంక గాంధీ ప్రచారంతో ముగించడం విశేషం. ఇక, కాంగ్రెస్ ప్రచారం మొత్తం ఆరు గ్యారెంటీలతోపాటు రుణ మాఫీ చుట్టూ తిరిగింది.
చేయాల్సి వచ్చింది.
కేవలం వంద రోజుల పాలనలోనే హామీ ఇచ్చిన విధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం; రూ.500కే సిలిండర్; 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు; రాజీవ్ ఆరోగ్యశ్రీ చికిత్స సీలింగ్ పెంపు; ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేశామని కాంగ్రెస్ నేతలు వివరించారు. ఆగస్టు 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ మాఫీ పథకాన్ని అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటించారు. ఎక్కడికి వెళితే అక్కడి దేవుడిపై ఒట్టు వేసి మరీ తేల్చి చెప్పారు. దీనిపై హరీశ్, రేవంత్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. పంద్రాగస్టులోగా రుణ మాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరితే.. రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని రేవంత్ స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ ప్రచారంలో ‘గాడిద గుడ్డు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణకు బీజేపీ ఏమీ ఇవ్వలేదనే విషయాన్ని సింబాలిక్‌గా చెబుతూ కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి తెరలేపింది. చివర్లో, సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రచారాన్ని కొత్త మలుపు తిప్పారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెంచుతామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడంతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని తిరగ రాస్తుందని, అందుకే తమకు 400 సీట్లు ఇవ్వాలని అడుగుతోందని విమర్శలు ఎక్కుపెట్టారు. నిజానికి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రచారంలో ఇవే కీలకాంశాలుగానూ మారాయి. ఇదే అంశంలో డీప్ ఫేక్ వీడియో తెరపైకి రావడం.. దీనిపై సీఎం రేవంత్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం కొసమెరుపు.
- హైదరాబాద్, ఆంధ్రజ్యోతి
ప్రచారం ముగిసింది! ప్రసంగాలకు తెరపడింది! ప్రలోభాలు సరేసరి! ఓటరు ప్రసన్నంపై అంచనాలు మిగిలాయి! దాదాపు మూడు వారాలపాటు హోరాహోరీ ప్రచారం ముగిసింది. ఎన్నికల యుద్ధంలో అన్ని పార్టీలూ అలుపెరుగని పోరాట పటిమను ప్రదర్శించాయి. తమ తమ వాదాలను, వాదనలను ప్రజల ముందు ఉంచాయి. కాంగ్రెస్ ప్రచారంలో ‘గాడిద గుడ్డు’ హైలైట్‌గా నిలిస్తే.. బీజేపీ ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ను తెరపైకి తెచ్చింది! వెరసి, ఎవరి అంచనాలు వారికి ఉన్నా.. అన్ని పార్టీలూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తొలి నుంచీ ‘టార్గెట్ 14’ అంటూ ముందుకు వెళుతుంటే.. ఈసారి డబుల్ డిజిట్‌కు చేరాలని బీజేపీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చావో రేవో పోరాటంలో 14 సీట్లలో గెలిపిస్తే.. ‘నేనూ ప్రధాని రేసులో ఉంటా’ అంటూ కేసీఆర్ ఆకాశానికి నిచ్చెన వేసేశారు.
తగ్గిన ఎన్నికల ఖర్చు
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు తక్కువగానే కనిపిస్తోంది. మండే ఎండల్లో ప్రచారం చేయాల్సి రావడంతో దాదాపు అన్ని పార్టీలూ ఉదయం, సాయంత్రమే ప్రచారానికి పరిమితమయ్యాయి. ఇంకా చెప్పాలంటే, రోడ్ షోలు, కార్నర్ మీటింగులకే పెద్దపీట వేశాయి. మరోవైపు, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వీధి వీధికి కనబడ్డ ప్రచార తీరు ఎంపీ ఎన్నికలొచ్చేసరికి గ్రామానికొకటి కూడా కనిపించలేదు. దీంతో, ఖర్చు నామమాత్రంగానే చేయాల్సి వచ్చింది. అలాగే, ఓట్లను గంపగుత్తగా కొనేసే పరిస్థితి నేతల్లో కనిపించలేదు. ఓటర్లకు కూడా డబ్బు పంపిణీ అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఇవ్వడం లేదు.
ఒపినియన్ పోల్స్..
ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మెజారిటీ సీట్లను తామే గెలవబోతున్నామంటూ ప్రజల్ని ప్రలోభపెట్టినా.. జనం నాడి మాత్రం వేరేలా ఉంది. గత ఏడాది డిసెంబరు నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో తెలంగాణలో పలు జాతీయ చానళ్లు, సర్వే సంస్థలు ఓటరు నాడిని పసిగట్టే ప్రయత్నం చేశాయి. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ 8-10 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఇవ్వగా.. బీజేపీ 3-6 మధ్య, బీఆర్‌ఎ్‌సకు 1-2, ఎంఐఎం పార్టీకి ఒక సీటు వస్తుందని అంచనా వేశాయి. ఏబీపీ న్యూస్- సీ ఓటర్ సర్వే కాంగ్రె్‌సకు 10 సీట్లివ్వగా.. ఎన్డీయేకు ఐదు, బీఆర్‌ఎస్, ఎంఐఎంకు చెరొకటి ఇచ్చింది. ఇండియా టు డే సర్వేలో కూడా కాంగ్రె్‌సకు పది ఇవ్వగా, ఎన్డీఏకు 3, బీఆర్‌ఎ్‌సకు 3, ఇతరులకు ఒకటి ఇచ్చింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఓటరు సోమవారం తీర్పు ఇవ్వనున్నాడు. ఓటరు తీర్పు ఏమిటన్నది జూన్ 4న వెలువడనుంది!!
కేసీఆర్ బస్సు యాత్ర
కాలుకు శస్త్ర చికిత్స జరిగినా బీఆర్‌ఎస్ ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా మారారు. ఎండల నేపథ్యంలో బహిరంగ సభలకు స్వస్తి పలికి వ్యూహాత్మకంగా బస్సు యాత్ర, కార్నర్ మీటింగులకే ఓటేశారు. బీఆర్‌ఎస్ ప్రచారం తొలి రోజుల్లో కరెంటు కోతలను, మంచినీటి కొరతను ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకున్నా.. వెన్వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి చెక్ చెప్పింది. కరెంటు కోతలు విధించిన అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు మంచినీటి కొరత నివారణకు ప్రణాళిక ప్రకటించింది. అనంతరం, బీఆర్‌ఎస్ ప్రచారమంతా కృష్ణా, గోదావరి జలాల వాటాపై నడిపింది. కృష్ణా జలాల రక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఇక, బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ‘గాడిద గుడ్డు’ ప్రచారం, బీజేపీ ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ తరహాలో నిర్దిష్ట ప్రచార శైలి కరువైంది. కాకపోతే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా తమ పార్టీలోకి వచ్చేస్తారని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి తదితరులు వ్యాఖ్యానించడంతో ఎన్నికలైన తర్వాత రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వెళ్లిపోతారంటూ పదే పదే వ్యాఖ్యానించారు. దీనితోపాటు ఆరు హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, ఇది సహజంగా వచ్చిన కరువు కాదని ప్రచారం లేవనెత్తినా.. చివర్లో వర్షాలు కురవడంతో దానికి తెరపడింది.
మోదీ చుట్టూ..
తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్‌పై కన్నేసిన బీజేపీ ప్రచారం అంతా ప్రధాని మోదీ చుట్టూ తిరిగింది. మోదీ గ్యారెంటీని చూసి ఓటు వేయాలంటూ అభ్యర్థించింది. ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మినహా బీజేపీ రాష్ట్ర నేతలంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కాగా.. మోదీ, అమిత్ షా రాష్ట్రాన్ని పలు సందర్భాల్లో చుట్టేశారు. వివిధ నియోజకవర్గాల్లో పలువురు కేంద్ర మంత్రులు భాగస్వాములయ్యారు. నిజానికి, కాంగ్రెస్ ‘గాడిద గుడ్డు ప్రచారాని’కి బీజేపీ పలు సందర్భాల్లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణకు గత పదేళ్లలో తాము ఎన్ని నిధులు, ఎన్ని పథకాలు ఇచ్చామో చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందనే కాంగ్రెస్ ప్రచారానికీ వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిములకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఆ కోటాను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని మోదీ, అమిత్ షా పదే పదే స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందనే ప్రచారానికీ ఆ పార్టీ నేతలు దీటుగా జవాబిచ్చారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా నెహ్రూ, ఇందిర, రాజీవ్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు మార్చారని గుర్తు చేశారు. ఇక, బీజేపీ ప్రచారంలో ‘ఆర్ ఆర్ ట్యాక్స్’ హైలైట్‌గా నిలిచింది. రాష్ట్రంలో రేవంత్ జాతీయ స్థాయిలోని రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నారంటూ మోదీ, షా విమర్శలు గుప్పించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్లు వసూలు చేసిందని, ‘ఆర్‌ఆర్’ ట్యాక్సు దానిని మించిపోయిందంటూ వెయ్యి కోట్లకుపైగానే కప్పం కట్టారంటూ ఆరోపించారు. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే మౌనం పాటించింది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన జరిపిస్తామన్న కాంగ్రెస్ హామీతోపాటు పలువురు నాయకుల ప్రకటనలను బీజేపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఇళ్లు సహా సంపదను లాగేసుకుంటారని, మహిళల మెడలో మంగళ సూత్రాలను కూడా ఉంచరని, వాటిని లాక్కుని ముస్లిములకు పంచుతారంటూ ప్రధాని మోదీ ప్రచారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. నిజానికి, అయోధ్య ఆలయం చుట్టూ ఈసారి ప్రచారాన్ని పరిమితం చేయాలని తొలుత బీజేపీ భావించినా.. చివరికి వచ్చేసరికి రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు, ముస్లిముల చుట్టూ తిప్పాల్సి వచ్చింది. వెరసి, పదేళ్లలో తెలంగాణకు తాము ఏమి చేశామన్న దానికంటే భావోద్వేగాలతో కూడిన ఈ అంశాల చుట్టూ బీజేపీ తన ప్రచారాన్ని