Share News

Viral Video: ఫ్లైట్‌లో రామ భజన చేస్తూ ప్రయాణికుల రచ్చ.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 07 , 2024 | 08:50 AM

ఇండిగో విమానంలో కొందరు ప్రయాణికులు వింతగా ప్రవర్తించారు. విమానం గాలిలో ఉండగానే రామ భజన చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఫ్లైట్‌లో రామ భజన చేస్తూ ప్రయాణికుల రచ్చ.. వీడియో వైరల్

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: కొందరు ప్రయాణికులు ఇతరుల మనోభావాలు కానీ, వారికి ఇబ్బంది కలుగుతుందని ఏ మాత్రం ఆలోచించరు. తమకు నచ్చిందంటే చాలు ఆట ఆడతారు. లేదంటే పాట పాడుతారు. ఇండిగో విమానంలో (Indigo Flight) ఇలాంటి ఘటన జరిగింది. ఇద్దరు ముగ్గురు ఇలా ప్రవర్తించారు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయ్యింది. ప్రయాణికుల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు.

ఏం జరిగిందంటే..?

ఆ ఘటన ఎప్పడు జరిగింది..? విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందనే అంశంపై స్పష్టత లేదు. ఓ ప్రయాణికుడు లేచి నిల్చొని రఘుపతి రాఘవ రాజారామ్ అని పాడటం స్టార్ట్ చేశాడు. అతనికి మరికొందరు జత కలిశారు. ఇంకొకరు అయితే ఏకంగా డోలు (డ్రమ్) వాయిస్తూ వారిని ఎంకరేజ్ చేశాడు. విమానం గాలిలో ఉండగా వీరు ఇతరులకు ఇబ్బంది కలిగించారు. ఇంకొ ప్రయాణికుడు ఈ తతంతాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇండిగో విమానం గాలిలో ఉండగా భజన అని వీడియోకు క్యాప్షన్ రాశారు.

2 లక్షల వ్యూస్

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2 లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల కామెంట్లతో ఆ సెక్షన్ నిండిపోయింది. ఇండిగో యజమాన్యాన్ని తప్పుపట్టారు. ప్రయాణికుడికి డోలు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. హిందు మతాన్ని అవమానించేందుకు భజన చేసి అలా ప్రవర్తించారని మిగతా వారు మండిపడ్డారు. చట్టం ప్రకారమే విమానంలో ఆ విధంగా ప్రవర్తించారా..? విమానం మొత్తం ఒక మతానికి చెందిన వారు బుక్ చేసుకున్నారా..? అని అడిగారు. ఇది తమకు ఇబ్బంది కలిగించింది. భజన చేసిన వారిపై ఇప్పటికీ ఇండిగో యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని మరొకరు అభిప్రాయ పడ్డారు.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 07 , 2024 | 08:50 AM