Share News

Viral Video: రోడ్డు పక్కన కాలువ నుంచి వింత శబ్ధాలు.. చివరకు ఏముందా అని మూత తెరచిచూడగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - May 02 , 2024 | 06:59 PM

ఊహించని ప్రదేశాల్లో ఊహించని జీవులు బయటపడడం తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇళ్లల్లోని ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, మంచాలు తదితర వస్తువుల నుంచి ఊహించని విధంగా విష సర్పాలు బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ...

Viral Video: రోడ్డు పక్కన కాలువ నుంచి వింత శబ్ధాలు.. చివరకు ఏముందా అని మూత తెరచిచూడగా.. షాకింగ్ సీన్..

ఊహించని ప్రదేశాల్లో ఊహించని జీవులు బయటపడడం తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇళ్లల్లోని ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, మంచాలు తదితర వస్తువుల నుంచి ఊహించని విధంగా విష సర్పాలు బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డు పక్కన కాలువలో వింత శబ్ధాలు వస్తుండడంతో చుట్టపక్కల వారికి అనుమానం కలిగింది. చివరికి లోపల ఏముందా అని మూత తెరచి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన కాలువ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో చుట్టు పక్కల వారికి అనుమానం కలిగింది. దీంతో చివరకు స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు కాలువలో ఏముందా అనే అనుమానంతో మూత తెరిచారు. లోపల నుంచి పొడవాటి నాగుపాము (Cobra) ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. పామును బయటికి లాగాలని చూసినా లోపలికి వెళ్తుండడంతో ఇబ్బందిగా మారింది. చివరికి అతి కష్టం మీద ఇద్దరు వ్యక్తులు పట్టుకుని బయటికి లాగారు. అత్యంత పొడవుగా ఉన్న నాగుపామును చూసి చివరకు అంతా షాక్ అయ్యారు.

Viral Video: స్విమ్మింగ్‌ఫూల్‌ను కబ్జా చేసి.. ఈ కోతులు చేస్తున్న నిర్వాకం చూస్తే..


పాము తలను చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్లు చివరకు దాన్ని అక్కడి నుంచి సురక్షితంగా బయటికి తీసుకెళ్లారు. మొత్తానికి పామును పట్టుకోవడంతో అక్కడున్న వారంతా హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇంత పెద్ద కోబ్రాను ఎక్కడా చూడలేదు’’... అంటూ కొందరు, ‘‘స్నేక్ క్యాచర్లు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ఉన్నట్టుండి వాహనం అడుగున చూడగా.. ఎవరూ ఊహించని విధంగా..

Updated Date - May 02 , 2024 | 06:59 PM