Share News

Viral Video: స్విమ్మింగ్‌ఫూల్‌ను కబ్జా చేసి.. ఈ కోతులు చేస్తున్న నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - May 02 , 2024 | 03:47 PM

కోతులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు. అప్పటికివరకూ సైలెంట్‌గా ఉండే కోతులు.. ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు ఇళ్లల్లోకి దూరి రచ్చరచ్చ చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు...

Viral Video: స్విమ్మింగ్‌ఫూల్‌ను కబ్జా చేసి.. ఈ కోతులు చేస్తున్న నిర్వాకం చూస్తే..

కోతులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు. అప్పటికివరకూ సైలెంట్‌గా ఉండే కోతులు.. ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు ఇళ్లల్లోకి దూరి రచ్చరచ్చ చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఖాళీగా ఉన్న స్విమ్మింగ్‌ఫూల్‌ను కొన్ని కోతులు కబ్జా చేశాయి. చివరకు అవి చేస్తున్న నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని (Mumbai) బోరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాళీగా ఉన్న ఓ స్విమ్మింగ్‌పూల్‌ను (Swimming Pool) కొన్ని కోతులు టార్గెట్ చేశాయి. అసలే వేసవి కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో స్విమ్మింగ్‌పూల్‌ను చూడగానే వాటికి ఓ ఐడియా వచ్చేసింది. ‘‘పూల్ ఎలాగూ ఖాలీగా ఉందీ.. వాడాసుకుంటే పోలా’’.. అని అనుకుంటూ నీటిలో దూకేశాయి. అన్నీ సరదగా ఈత కొడుతూ (Monkeys swimming) .. అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించాయి.

Viral Video: రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ఉన్నట్టుండి వాహనం అడుగున చూడగా.. ఎవరూ ఊహించని విధంగా..


వాటిలో కొన్ని కోతులైతే ముచ్చట్లాడుకుంటూ ఈత ఆడుతున్నాయి. మరికొన్ని స్విమ్మింగ్‌పూల్లోనే అటూ ఇటూ దూకుతూ చిన్నిపిల్లల్లా ఎంజాయ్ చేశాయి. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతుల సరదా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎండ వేడి నుంచి రిలాక్స్ అవుతున్న మంకీస్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి పాత కూలర్‌ని ఏసీగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 02 , 2024 | 03:47 PM