Share News

Viral video: చైనీస్ మేనేజర్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఆఫ్రికన్ కార్మికుల పట్ల అతడి దారుణం చూస్తే..

ABN , Publish Date - May 03 , 2024 | 07:07 PM

ప్రస్తుత టెక్నాలజీ రంగంలోనూ.. వర్ణవివక్ష, జాతి వివక్ష కారణంగా ఎంతో మంది దాడులకు గురవుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక నల్లజాతీయుల పేరుతో నిత్యం అనేక రకాల దాడులు జరగడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral video: చైనీస్ మేనేజర్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఆఫ్రికన్ కార్మికుల పట్ల అతడి దారుణం చూస్తే..

ప్రస్తుత టెక్నాలజీ రంగంలోనూ.. వర్ణవివక్ష, జాతి వివక్ష కారణంగా ఎంతో మంది దాడులకు గురవుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక నల్లజాతీయుల పేరుతో నిత్యం అనేక రకాల దాడులు జరగడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు ఆఫ్రికన్ కార్మికులపై ఓ చైనీస్‌ యజమాని బెల్టుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లే వారిలో ఆఫ్రికన్లు ఎక్కువగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలో చాలా దేశాల్లో ఆఫ్రికన్లు వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే చాలా దేశాల్లో వీరు జాత్యాహంకార దాడులకు గురవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. చైనాలో పని చేసే ఇద్దరు ఆఫ్రికన్లపై వారి యజమాని విచక్షణారహితంగా దాడి చేశారు.

Viral Video: మాంసం ముక్కలను కట్ చేస్తుండగా.. దిమ్మతిరిగే సీన్.. ఒక్కసారిగా వాటిలో ఒకటి..


ఓ కంటైనర్‌లో నేలపై కూర్చున్న ఆఫ్రికన్ యువకుల వద్దకు చైనీస్ మేనేజర్ వస్తాడు. వచ్చీ రాగానే బెల్టుతో (Chinese Manager attacks African workers) వారిపై దాడికి తెగబడగాడు. దెబ్బలు తాళలేక వారు వద్దు.. వద్దు.. అని మొత్తుకుంటున్నా కనికరం చూపకుండా కొడుతూనే ఉన్నాడు. ఇలా చాలా సేపు ఆ వ్యక్తి.. వారిపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఇదిలావుండగా, ఆఫ్రికన్ల పట్ల చైనీయులు గతంలో పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. ఆఫ్రికన్ కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించుకుని.. తక్కువ వేతనాలు ఇస్తున్నారని చాలా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి దాడులపై ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరతున్నారు.

Viral Video: పెళ్లికొడుకును ఎక్కించుకున్న గుర్రం.. ఊరేగింపులో ఓ యువకుడు డాన్స్ వేయడం చూసి..


చైనీయులు ఆఫ్రికన్‌ వర్కర్లను ట్రాన్స్‌ అట్లాంటిక్‌ బానిసలుగా ట్రీట్‌ చేస్తున్నారని ప్రస్తావిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. చైనీస్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది దారుణం.. ఇలా దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘చాలా దేశాల్లో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పాత సైకిల్‌ని ఇలాక్కూడా వాడొచ్చా.. ఈమె అతి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

Updated Date - May 03 , 2024 | 07:07 PM