Share News

Viral Video: పెళ్లికొడుకును ఎక్కించుకున్న గుర్రం.. ఊరేగింపులో ఓ యువకుడు డాన్స్ వేయడం చూసి..

ABN , Publish Date - May 03 , 2024 | 06:29 PM

వివాహ కార్యక్రమాలకు సంబంధించిన అనేక ఘటనలు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో వైరల్ అవుతుంటాయి. వధూవరుల మధ్య చోటు చేసుకునే తమాషా ఘటనలు, వధూవరులపై స్నేహితులు ప్రాంక్ వీడియోలు ప్లాన్ చేయడం, ఊరేగింపులో...

Viral Video: పెళ్లికొడుకును ఎక్కించుకున్న గుర్రం.. ఊరేగింపులో ఓ యువకుడు డాన్స్ వేయడం చూసి..

వివాహ కార్యక్రమాలకు సంబంధించిన అనేక ఘటనలు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో వైరల్ అవుతుంటాయి. వధూవరుల మధ్య చోటు చేసుకునే తమాషా ఘటనలు, వధూవరులపై స్నేహితులు ప్రాంక్ వీడియోలు ప్లాన్ చేయడం, ఊరేగింపులో వధూవరులతో పాటూ బంధువులంతా డాన్సులు వేయడం తదితర అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి కొడుకును ఎక్కించుకున్న గుర్రం.. ఊరేగింపులో డాన్స్ వేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వరుడిని గుర్రంపై ఊరేగిస్తుంటారు. ఇందుకోసం ఓ తెల్లటి గుర్రాన్ని అందంగా అలంకరించారు. తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న వరుడిని గుర్రం పైకి ఎక్కిస్తారు. మధ్యలో యువకులు డీజే పాటలకు డాన్సులు వేస్తూ సందడి చేస్తారు. ఈ సందర్భంగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ యువకుడు డాన్స్ వేయడం చూసి గుర్రం కూడా కాలు కదుపుతుంది. అది కూడా అచ్చం మనుషుల్లాగానే (horse dancing in wedding procession) డాన్స్ చేస్తూ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

Viral Video: మాంసం ముక్కలను కట్ చేస్తుండగా.. దిమ్మతిరిగే సీన్.. ఒక్కసారిగా వాటిలో ఒకటి..


యువకుడు వేసే స్టెప్పులకు అనుగుణంగా డాన్స్ చేస్తూ.. మధ్య మధ్యలో నేలపై కూర్చుంటూ మళ్లి పైకి లేస్తూ, ముందుకు వెనక్కూ జరుగుతూ చూడమచ్చటగా డాన్స్ చేసింది. పైన ఉన్న వరుడిని బ్యాలెన్స్ చేసుకుంటూ డాన్స్ చేసిన ఈ గుర్రాన్ని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గుర్రం చాలా స్మార్ట్ గురూ..’’ అంటూ కొందరు, ‘‘డాన్స్ అద్భుతంతా చేసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పాత సైకిల్‌ని ఇలాక్కూడా వాడొచ్చా.. ఈమె అతి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

Updated Date - May 03 , 2024 | 06:29 PM