Share News

Viral Video: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి దృశ్యాలను ఎక్కడైనా చూశారా.. వీరి తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - May 02 , 2024 | 09:17 PM

ప్రస్తుతం ఎండల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం 7గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి ఎలా ఉంటుందో రోజూ చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో...

Viral Video: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి దృశ్యాలను ఎక్కడైనా చూశారా.. వీరి తెలివి మామూలుగా లేదుగా..

ప్రస్తుతం ఎండల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం 7గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి ఎలా ఉంటుందో రోజూ చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇక పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో తాజాగా, పుదుచ్చేరికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ ట్రాఫిక్ పోలీసుల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మండుతున్న ఎండల నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగిచేందుకు పుదుచ్చేరిలోని (Puducherry) పలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజాసంఘాల కార్యకర్తలు గ్రీన్ మ్యాట్ (గ్రీన్ షాడో క్లాత్) ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో రోజురోజుకూ వేడిగాలులు విజృంభిస్తున్నాయి. పగటిపూట వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. పనుల నిమిత్తం, నిత్యావసరాల నిమిత్తం ద్విచక్రవాహనాలపై బయటకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద 4 నుంచి 5 నిమిషాల పాటు నిరీక్షించాల్సి రావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

Viral Video: రోడ్డు పక్కన కాలువ నుంచి వింత శబ్ధాలు.. చివరకు ఏముందా అని మూత తెరచిచూడగా.. షాకింగ్ సీన్..


వాహనదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకున్న సామాజిక కార్యకర్తలు.. వాహనదారులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు వినూత్న చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తలు పుదుచ్చేరి అన్నాస్క్వేర్, కామరాజ్ స్క్వేర్, ఇందిరాగాంధీ స్క్వేర్, రాజీవ్ గాంధీ స్క్వేర్, అజంతా తదితరులు.. చౌరస్తాల్లోని పలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద (Installation green mats at traffic signals) గ్రీన్ మ్యాట్‌లు ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులకు రిలీఫ్ దొరికినట్లైంది.

Viral Video: రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ఉన్నట్టుండి వాహనం అడుగున చూడగా.. ఎవరూ ఊహించని విధంగా..


వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేసినందుకు గానూ.. ప్రజలు సామాజిక కార్యకర్తలను అభినందిస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘చాలా గొప్ప పని చేశారు’’.. అంటూ కొందరు, ‘‘సామాజిక కార్యకర్తలను అంతా ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పాము కాటుతో చనిపోవడంతో.. నీటిలో వేలాడదీశారు.. చివరికి రెండు రోజుల తర్వాత..

Updated Date - May 02 , 2024 | 09:17 PM