Share News

Viral video: యువతి డాన్స్ చూసి దిగాలుగా ఉన్న వధూవరులు.. అంతలో ఆమె తల్లి అక్కడికి రావడంతో..

ABN , Publish Date - May 03 , 2024 | 08:24 PM

వివాహ కార్యక్రమాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. వరుడి ఎదుట వధువు కొన్నిసార్లు , వధువును ఉత్సాహపరుస్తూ వరుడు మరికొన్నిసార్లు డాన్స్‌లు చేయడం చూస్తుంటాం. అయితే ఇంకొన్నిసార్లు ఈ డాన్సులు శ్రుతిమించిపోతుంటాయి. ఇలాంటి...

Viral video: యువతి డాన్స్ చూసి దిగాలుగా ఉన్న వధూవరులు.. అంతలో ఆమె తల్లి అక్కడికి రావడంతో..

వివాహ కార్యక్రమాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. వరుడి ఎదుట వధువు కొన్నిసార్లు , వధువును ఉత్సాహపరుస్తూ వరుడు మరికొన్నిసార్లు డాన్స్‌లు చేయడం చూస్తుంటాం. అయితే ఇంకొన్నిసార్లు ఈ డాన్సులు శ్రుతిమించిపోతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పెళ్లిలో యువతి డాన్స్ చూసి వధూవరులు దిగాలుగా ఉన్నారు. ఆ సమయంలో యువతి తల్లి అక్కడికి రావడంతో చివరికి ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) వేదికపై కూర్చుని ఉంటారు. ఆ సమయంలో ఓ యువతి స్టేజి మీదకు వచ్చి.. వధూవరుల ఎదుట డాన్స్ చేయడానికి సిద్ధపడుతుంది. ఆమె వేసి బెల్లీ డాన్స్ చూసి స్టేజీ కింద ఉన్న యువతీయువకులంతా ఈలలు, కేకలు వేస్తూ ఎంకరేజ్ చేశారు. అయితే యువతి వేసిన డాన్స్ (Young woman dance) వధూవరులకు మాత్రం ఏమాత్రం నచ్చనట్లుంది. ఆ సమయంలో వరుడు నేలపైకి చూస్తూ దిగాలుగా కనిపించాడు. అలాగే వధువు కూడా యువతి డాన్స్ పట్ల అసంతృప్తి ప్రదర్శిస్తున్నట్లు కనిపించింది.

Viral video: చైనీస్ మేనేజర్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఆఫ్రికన్ కార్మికుల పట్ల అతడి దారుణం చూస్తే..


యువతి డాన్స్ చూసి చివరకు ఏమనుకుందో ఏమో గానీ.. ఆమె తల్లి సడన్‪గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. తన కుమార్తె వద్దకు వెళ్లి కోపంగా.. ‘‘ఏంటీ డాన్సులు.. పక్కకు వెళ్లు’’.. అన్నట్లుగా చేత్తో నెట్టుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువతి బెల్లీ డాన్స్.. వధూవరులకు నచ్చలేదేమో’’.. అంటూ కొందరు, ‘‘నిజంగా యువతి డాన్స్ చూడలేకున్నాం.. మధ్యలో ఆపి ఆమె తల్లి మంచి పని చేసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లికొడుకును ఎక్కించుకున్న గుర్రం.. ఊరేగింపులో ఓ యువకుడు డాన్స్ వేయడం చూసి..

Updated Date - May 03 , 2024 | 08:24 PM