Share News

Viral Video: ఇలాంటి దాడి ఎప్పుడైనా చూశారా.. రాత్రి వేళ ఇంటి కాంపౌండ్ మీదకు దూకిన చిరుత.. వెళ్తూ వెళ్తూ..

ABN , Publish Date - May 31 , 2024 | 08:54 PM

పులులు, సింహాల దాడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి ఓ జంతువును టార్గెట్ చేశాయంటే.. ఇక అవి వాటికి ఆహారం అయిపోవాల్సిందే. కొన్నిసార్లు కిలోమీటర్ల మేర వెంటాడుతూ వేటాడితే.. మరికొన్నిసార్లు..

Viral Video: ఇలాంటి దాడి ఎప్పుడైనా చూశారా..  రాత్రి వేళ ఇంటి కాంపౌండ్ మీదకు దూకిన చిరుత.. వెళ్తూ వెళ్తూ..

పులులు, సింహాల దాడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి ఓ జంతువును టార్గెట్ చేశాయంటే.. ఇక అవి వాటికి ఆహారం అయిపోవాల్సిందే. కొన్నిసార్లు కిలోమీటర్ల మేర వెంటాడుతూ వేటాడితే.. మరికొన్నిసార్లు ఎలాంటి శ్రమా లేకుండా ఈజీగా వేటాడేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళ గ్రామంలోకి చొరబడిన చిరుతపులి.. చివరకు ఓ ఇంటి కాంపౌండ్ మీదకు దూకింది. ఈ క్రమంలో అది వేటాడిన పద్ధతి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు (Tamil Nadu) కోయంబత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ చిరుతపులి (Leopard) అటవీ ప్రాంతం నుంచి రాత్రి వేళ గ్రామంలోకి చొరబడింది. ఈ క్రమంలో ఆహారం కోసం ఊరంతా వెతికింది. చివరకు ఓ ఇంటి వద్ద ఆగి గమనిస్తుండగా.. దానికి ఆ ఇంటి గోడపై ఉన్న కోడి కనిపించింది. దీంతో వెంటనే కోడిని టార్గెట్ చేసేసింది. మెల్లగా కాంపౌండ్ వద్దకు వెళ్లిన చిరుత.. ఒక్కసారిగా గోడ పైకి జంప్ చేసింది.

Viral Video: కుందేలు చేష్టలకు నివ్వెరపోయిన వాహనదారులు.. దారి మధ్యలో అది చేసిన పనేంటంటే..


పులి రాకను గమనించిన కోడి అక్కడి నుంచి కిందకు దూకి తప్పించుకోవాలని ప్రయత్నించింది. అయినా చిరుత పులి మాత్రం కోడిని వదలకుండా వెంటాడింది. చివరకు దాన్ని ( leopard attacked hen) నోట కరుచుకుని మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘చిరుతపులి వేట అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ చిరుతకు చికెన్ అంటే బాగా ఇష్టమున్నట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎగ్జిబిషన్‌ను కూడా వదల్లేదు.. జాయింట్ వీల్‌‌లో ప్రేమికుల నిర్వాకం చూస్తే..

Updated Date - May 31 , 2024 | 08:54 PM