Share News

Viral Video: ఇదెక్కడి తెలివిరా బాబోయ్.. కూలర్‌ను ఫ్రిడ్జ్‌గా ఎలా మార్చాడో చూడండి..

ABN , Publish Date - May 31 , 2024 | 04:58 PM

ఇంట్లోని వస్తువులతో చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసే వారిని చాలా మందిని చూశాం. కొందరు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు..

Viral Video: ఇదెక్కడి తెలివిరా బాబోయ్.. కూలర్‌ను ఫ్రిడ్జ్‌గా ఎలా మార్చాడో చూడండి..

ఇంట్లోని వస్తువులతో చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసే వారిని చాలా మందిని చూశాం. కొందరు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు కూలర్‌ను, ఫ్రిడ్జ్‌ను ఎదురెదురుగా పెడుతుంటే.. మరికొందరు ఏకంగా తమ ఇళ్లపై నీటి స్ప్రింకర్లను ఏర్పాట చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలను చాలా మంది చూసే ఉంటారు. తాజగా, ఓ వ్యక్తి కూలర్‌ను ఫ్రిడ్జ్‌గా వాడడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇదెక్కడి తెలివిరా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోవడంతో ఓ వ్యక్తి ఏదోటి చేసి ఫ్రిడ్జ్‌ (fridge) ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే ఇందుకోసం రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఫ్రిడ్జ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చివరకు అతను కూలర్‌ను (Cooler) వాడుకున్నాడు. ఇంట్లో ఉన్న కూలర్‌ను ఫ్రిడ్జ్‌ తరహాలో మార్చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం అతను కూలర్ వెనుక వైపు ఉన్న డోరు తొలగించి, లోపల పండ్లు, కూరగాయలన్నింటినీ వేలాడదీశాడు. కూరల్ ఫ్యాన్ తిరగడం వల్ల లోపల ఉన్న వస్తువులన్నీ పాడవకుండా ఉంటాయనేది అతడి ఉద్దేశం.

Viral Video: కారు కంపెనీలు కూడా ఇలా ఆలోచించి ఉండవేమో.. ఈమె రివర్స్ టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


అధిక సంఖ్యలో పండ్లు, కూరగాయలను కూలర్ లోపల వేలాడదీయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘కూరల్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ‘‘ఐడియా అదిరింది బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా లైక్‌లను సొంత చేసుకుంది.

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే.. రైతు తెలివితేటలు మామూలుగా లేవుగా..

Updated Date - May 31 , 2024 | 04:58 PM