Share News

Viral Video: వధువు దండ వేస్తుండగా వరుడికి ఊహించని షాక్.. ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్న నెటిజన్లు..

ABN , Publish Date - May 30 , 2024 | 07:30 PM

వివాహ సమయాల్లో అనుకుని చేసే కొన్ని, అనుకోకుండా చోటు చేసుకునే మరికొన్ని ఘటనలు.. వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. మొత్తంగా ఇలాంటి ..

Viral Video: వధువు దండ వేస్తుండగా వరుడికి ఊహించని షాక్.. ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్న నెటిజన్లు..

వివాహ సమయాల్లో అనుకుని చేసే కొన్ని, అనుకోకుండా చోటు చేసుకునే మరికొన్ని ఘటనలు.. వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. మొత్తంగా ఇలాంటి వీడియోలన్నీ కలిసి నెటిజన్లకు వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వధువు దండ వేస్తుండగా.. వరుడికి ఊహించని షాక్ తగిలింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఘటన అందరికీ నవ్వు తెప్పిస్తోంది. పెళ్లి వేదికపై వధూవరులు (bride and groom) దండలు మార్చుకుంటుంటారు. ముందుగా వధువు మెడలో వరుడు దండ వేస్తాడు. తర్వాత వధువు వంతు వస్తుంది. చేతిలో దండ పట్టుకున్న వధువు.. సిగ్గుపడుతూనే వరుడి మెడలో వేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. వధువు తీరా దండ వేసే సమయంలో మధ్యలో ఓ యువకుడు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు.

Viral Video: ఆకలితో ఉందని మహిళ ఆహారం తినిపిస్తే.. చివరకు ఈ నక్క చేసిన నిర్వాకం..


వేగంగా దూసుకొచ్చిన అతను.. వరుడికి ముందు నిలబడతాడు. దీంతో వధువు అనుకోకుండానే దండను ఆ యువకుడి మెడలో వేస్తుంది. తీరా దండ వేసిన తర్వాత యువకుడిని చూసి షార్ అవుతుంది. అలాగే వరుడు కూడా ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కవుతారు. ఇదంతా వాళ్లు కావాలని చేసినా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఇది మామూలు ట్విస్ట్ కాదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాసూ’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 75 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రీల్స్ కోసం సిలిండర్‌పై యువతి డాన్స్.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటో మీరే చూడండి..

Updated Date - May 30 , 2024 | 07:30 PM