Share News

Viral Video: డ్రోన్‌ను ఇలా వాడటం ఎప్పుడైనా చూశారా.. ఇతనేంటీ మరీ వెరైటీగా ఉన్నట్టున్నాడు..

ABN , Publish Date - May 30 , 2024 | 08:45 PM

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో కొందరు అద్భుతాలు చేస్తుంటారు. మరికొందరు ఇదే టెక్నాలజీతో చేయకూడని పనులన్నీ చేస్తుంటారు. ఇంకొందరు చిత్రవిచత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి...

Viral Video: డ్రోన్‌ను ఇలా వాడటం ఎప్పుడైనా చూశారా.. ఇతనేంటీ మరీ వెరైటీగా ఉన్నట్టున్నాడు..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో కొందరు అద్భుతాలు చేస్తుంటారు. మరికొందరు ఇదే టెక్నాలజీతో చేయకూడని పనులన్నీ చేస్తుంటారు. ఇంకొందరు చిత్రవిచత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వ్యక్తి వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన డ్రోన్‌ను వినూత్నంగా వాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. డ్రోన్‌తో అంతా ప్రకృతికి సంబంధించిన వీడియోలను చిత్రీకరిస్తే.. ఇతను మాత్రం దాన్ని అందుకు పూర్తి విరుద్ధంగా వాడేశాడు. డ్రోన్ కెమెరాను గాల్లోకి పంపింపిన ఆ వ్యక్తి.. చివరకు దాన్ని ఓ మామిడి చెట్టు మీదకు పోనిచ్చాడు. మామిడి కాయలను కాండం వద్దకు చాకచక్యంగా పంపించి, డ్రోన్ రెక్కల సాయంతో వాటిని కట్ చేశాడు. ఇలా ఫైనల్‌గా డ్రోన్‌తో (man Cutting mangoes with drone) మామిడికాయలను తెంపేశాడు.

Viral Video: వధువు దండ వేస్తుండగా వరుడికి ఊహించని షాక్.. ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్న నెటిజన్లు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది’’.. అంటూ మరికొందరు, ‘‘మామిడి కాయల కోసం చూసుకుంటే డ్రోన్ పాడవుంది బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కారు కంపెనీలు కూడా ఇలా ఆలోచించి ఉండవేమో.. ఈమె రివర్స్ టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - May 30 , 2024 | 08:45 PM