Share News

Viral Video: చైన్‌స్నాచర్లకు ఊహించని షాక్.. చైన్ లాక్కొని పారిపోతుండగా..

ABN , Publish Date - May 30 , 2024 | 09:26 PM

చేసిన తప్పులకు కొన్నిసార్లు వెంట వెంటనే శిక్ష అనుభవించాల్సి వస్తుంటుంది. చాలా మంది తప్పని తెలిసి కూడా ఏవేవో తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఎప్పటికప్పుడు గుణపాఠాలు నేర్చుకుంటుంటారు. ఇలాంటి...

Viral Video: చైన్‌స్నాచర్లకు ఊహించని షాక్.. చైన్ లాక్కొని పారిపోతుండగా..

చేసిన తప్పులకు కొన్నిసార్లు వెంట వెంటనే శిక్ష అనుభవించాల్సి వస్తుంటుంది. చాలా మంది తప్పని తెలిసి కూడా ఏవేవో తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఎప్పటికప్పుడు గుణపాఠాలు నేర్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు చైన్‌స్నాచర్లు మహిళ మెడలో గొలుసు లాక్కొని పారిపోతున్నారు. ఈ క్రమంలో బస్సు ఎదురుగా రావడంతో ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన హర్యానాలో (Haryana) చోటు చేసుకుంది. ఇద్దరు చైన్‌ స్నాచర్లు (Chain Snatchers) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను టార్గెట్ చేశారు. ఓ వ్యక్తి బైకు స్టా్ర్ట్ చేసుకుని సిద్ధంగా ఉండగా.. మరో వ్యక్తి మహిళ వద్దకు వెళ్లి, ఆమె మెడలోని చైన్ లాక్కుని వచ్చాడు. తర్వాత ఇద్దరూ బైకుపై పారిపోయేందుకు ప్రయత్నించారు. అయింతే ఈ ఘటనను కాస్త ముందు నుంచీ గమనిస్తున్న బస్సు డ్రైవర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా వెళ్లి చైన్‌ స్నాచర్ల బైకును (bus hit the bike) ఢీకొన్నాడు. దీంతో వారు ఎగిరి పక్కన పడ్డారు.

Viral Video: డ్రోన్‌ను ఇలా వాడటం ఎప్పుడైనా చూశారా.. ఇతనేంటీ మరీ వెరైటీగా ఉన్నట్టున్నాడు..


అయితే వెంటనే తేరుకుని బైకును అక్కడే పడేసి, పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఏం జరుగుతోందో అర్థం కాక షాక్ అయ్యారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని, అంతా డ్రైవర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే దొంగలు దొరికారా, లేదా అన్న విషయం తెలియరాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నేరానికి శిక్ష బాగానే పడింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ బస్సు డ్రైవర్ చాలా మంచి పని చేశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కారు కంపెనీలు కూడా ఇలా ఆలోచించి ఉండవేమో.. ఈమె రివర్స్ టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - May 30 , 2024 | 09:31 PM