Share News

Viral Video: ఎగ్జిబిషన్‌ను కూడా వదల్లేదు.. జాయింట్ వీల్‌‌లో ప్రేమికుల నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - May 31 , 2024 | 07:18 PM

కొందరు ప్రేమికులు బహిరంగా ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ప్రేమికులు బైకులో వెళ్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. ఇంకొందరు మెట్రో రైళ్లలో ముద్దులు పెట్టుకుంటూ కనిపిస్తారు. ఇలాంటి...

Viral Video: ఎగ్జిబిషన్‌ను కూడా వదల్లేదు.. జాయింట్ వీల్‌‌లో ప్రేమికుల నిర్వాకం చూస్తే..

కొందరు ప్రేమికులు బహిరంగా ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ప్రేమికులు బైకులో వెళ్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. ఇంకొందరు మెట్రో రైళ్లలో ముద్దులు పెట్టుకుంటూ కనిపిస్తారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎగ్జిబిషన్‌లో జాయింట్ వీల్‌ ఎక్కిన వారు చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఆఖరికి ఎగ్జిబిషన్‌ను కూడా వదల్లేదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఎగ్జిబిషన్‌లో చాలా మంది సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇదే ఎగ్జిబిషన్‌లో ఓ ప్రేమ జంట నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. జాయింట్ వీల్ ఎక్కిన వారిలో కొందరికి షాకింగ్ సీన్ కనిపించింది. జాయింట్ వీల్ స్టార్ట్ అవగానే ఓ వ్యక్తి తన కెమెరా ఆన్ చేసి అంతా రికార్డ్ చేస్తున్నాడు.

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే.. రైతు తెలివితేటలు మామూలుగా లేవుగా..


ఈ క్రమంలో పైకి వెళ్లాక తన కెమెరాను కిందకు తిప్పగా.. ఓ ఊయలలో కూర్చున్న ప్రేమికులు ముద్దులు పెట్టుకోవడం కనిపించింది. ఈ సీన్ చూడగానే అతడితో పాటూ మిగతా వారు కూడా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆఖరికి ఎగ్జిబిషన్‌ను కూడా వదల్లేదుగా’’.., ‘‘కెమెరామెన్ షాక్ అయి ఉంటాడు’’.., ‘‘హే.. భయ్యా.. ఎగ్జిబిషన్‌లో ఇదేం పని’’.., ‘‘ఆక్సిజన్ అందిస్తున్నాడేమో’’.., ‘‘ఇలాంటి సీన్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆప్టర్’’.., అంటూ కొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదెక్కడి తెలివిరా బాబోయ్.. కూలర్‌ను ఫ్రిడ్జ్‌గా ఎలా మార్చాడో చూడండి..

Updated Date - May 31 , 2024 | 07:18 PM