Share News

Viral Video: స్మార్ట్ ఐడియా గురూ.. చపాతీలు చేసేందుకు కొత్త కోడలి నయా టెక్నిక్..

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:44 PM

టెక్నాలజీ పెరిగిపోతోంది. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అధిక శ్రమ పడి, చెమటోడ్చి వండి వార్చాల్సిన అవసరం కాస్తా తగ్గింది. ఆకలిగా అనిపించినా, వంట చేసే సమయం లేకపోయినా ఒక్క క్లిక్ తో నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టేస్తున్నారు నేటి అతివలు.

Viral Video: స్మార్ట్ ఐడియా గురూ.. చపాతీలు చేసేందుకు కొత్త కోడలి నయా టెక్నిక్..

టెక్నాలజీ పెరిగిపోతోంది. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అధిక శ్రమ పడి, చెమటోడ్చి వండి వార్చాల్సిన అవసరం కాస్తా తగ్గింది. ఆకలిగా అనిపించినా, వంట చేసే సమయం లేకపోయినా ఒక్క క్లిక్ తో నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టేస్తున్నారు నేటి అతివలు. ఇక కొత్తగా పెళ్లయిన అమ్మాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చదువు, ఉద్యోగం అంటూ వంట గది వైపే రావడం మానేశారు నేటి అమ్మాయిలు. ఫలితంగా అత్తారింట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం వైరల్ ( Viral ) అవుతున్న వీడియోలో ఓ కొత్త కోడలు చేసిన పని నెటిజన్లందరినీ ఆకట్టుకుంటోంది.

చపాతీలు చేయడం అంటే అంత ఈజీ కాదు. పిండి కలపాలి. ముద్దలుగా చేయాలి. వాటిని రొట్టెల పీటపై వేసి చపాతీలు ఒత్తుకోవాలి. ఒత్తుకున్న చపాతీలను పెనంపై కాల్చుకోవాలి. సన్నగా కాలిన తర్వాత వాటిని మంటపై వేసి పుల్కాలుగా చేయాలి. ఇంత తతంగం ఉంటుంది కాబట్టే చాలా మంది చపాతీలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. కానీ నార్త్ ఇండియాలో పరిస్థితి వేరు. అక్కడ అన్నం దొరకదు. చపాతీలే తినాలి. దీంతో అత్తారింటికి వచ్చిన ఓ మహిళ వెరైటీగా ఆలోచించింది.

Karnatka: కారులో కాలిన స్థితిలో మూడు మృతదేహాలు.. కారణం అదేనా..


విడివిడిగా చపాతీలు చేయకుండా ఒక పెద్ద పిండి ముద్దను తీసుకుంది. పీట వాడకుండా స్టవ్ బల్లపై పిండిని చపాతీలా ఒత్తుకుంది. ఆ తర్వాత ఓ గిన్నె తీసుకుని గుండ్రటి అచ్చులుగా కట్ చేసింది. ఇలా ఒకేసారి నాలుగు చపాతీలు చేసుకుంది. ఇలా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఈ ప్రక్రియ సాగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళ చాతుర్యానికి, తెలివికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆహా ఏమి తెలివి అని కొనియాడుతున్నారు. తమకూ ఇలాంటి కోడలే వస్తే ఎంతో బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల వ్యూస్‌ రావడం విశేషం.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 01:44 PM