Share News

Jagan Vs CBN: వైఎస్ జగన్‌పై చెప్పు విసరడం భావప్రకటన స్వేఛ్చ కాదా.. ఇప్పుడు తెలిసొచ్చిందా..!?

ABN , Publish Date - Mar 31 , 2024 | 02:06 PM

Gautam Sawang Comments Viral: ఇదిగో ఇప్పుడు చెప్పండి.. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అయితే నేడు కాదా.. కాకూడదా..? అనేది పోలీసులకు, వైసీపీ నేతలకు తెలియాలి మరి. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అనడం, అబ్బే అస్సలు తప్పు కాదన్న ఇదే పోలీసులు, పోలీస్ బాస్.. ఇప్పుడు మాత్రం జగన్‌పై చెప్పు విసిరారు అనే సరికి ఎంత హడావుడి చేస్తున్నారో చూస్తున్నాం కదా..

Jagan Vs CBN: వైఎస్ జగన్‌పై చెప్పు విసరడం భావప్రకటన స్వేఛ్చ కాదా.. ఇప్పుడు తెలిసొచ్చిందా..!?

అవును.. రాజకీయ నేతలపై చెప్పులు విసరితే తప్పేంటి..? అసలు చెప్పు విసరడాన్ని దాడి అని ఎలా అంటారు..? అది భావప్రకటన స్వేచ్ఛ.. ఇదీ నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియా (Social Media) వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddham) అంటూ ఎన్నికల ప్రచారం (AP Elections) చేపట్టారు. బస్సుపై అభివాదం చేస్తున్న జగన్‌కు ఊహించని పరిణామమే ఎదురైంది. ప్రభుత్వం ఆక్రోశంతోనో.. జగన్‌ పాలన నచ్చకో తీవ్ర కోప్రోదిక్తుడైన ఒక సామాన్యుడు.. సీఎంపై చెప్పు విసిరాడు. ఆ చెప్పు జగన్‌కు తగల్లేదు కానీ.. సీఎంకు పక్కగా వెళ్లి పడింది. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది, వైసీపీ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదంతా భద్రతా వైఫల్యం వల్లే జరిగిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆ దుండగుడు ఎవరు..? ఎందుకు ఈ పనిచేశాడు..? అని తెలుసుకునే పనిలో పడ్డారు. కాసేపు ఇది పక్కనెట్టి ఒక్కసారి గతంలోకి వెళ్లొద్దాం రండి..!

Janasena: మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్



Gowtham-sawang.jpg

అప్పుడేం జరిగింది..?

ఇదే వైసీపీ అధికారంలో ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా (Chandrababu) ఇలాగే దాడి జరిగింది. జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి పనులన్నీ ఎక్కడికక్కడ నిలిపివేసి.. కక్షసాధింపు చర్యలపు పాల్పడుతోందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. వారికి భరోసా కల్పించేందుకు రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. దీన్నే అదనుగా చేసుకున్న కొందరు వైసీపీ మూకలు బాబు వాహనంపై చెప్పులు, కర్రలతో దాడికి దిగారు. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనంగానే మారింది. ఎందుకంటే.. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం దారుణం. అయితే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతులెత్తేసారు. పైగా తప్పేంటి.. అని ఒకింత వెటకారమాడారు కూడా. నాడు ఈ ఘటనపై పెద్ద రచ్చే జరిగినప్పటికీ సింపుల్‌గా కొట్టి పారేశారు డీజీపీ.

Slippers-on-Chandrababu.jpg

ఇదీ అసలు కథ..!

ఇదిగో ఇప్పుడు చెప్పండి.. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అయితే నేడు కాదా.. కాకూడదా..? అనేది పోలీసులకు, వైసీపీ నేతలకు తెలియాలి మరి. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అనడం, అబ్బే అస్సలు తప్పు కాదన్న ఇదే పోలీసులు, పోలీస్ బాస్.. ఇప్పుడు మాత్రం జగన్‌పై చెప్పు విసిరారు అనే సరికి ఎంత హడావుడి చేస్తున్నారో చూస్తున్నాం కదా. ఇదిగో అధికారంలో ఉంటే ఇలాగే ఉంటుందన్న మాట. ఇప్పుడు పోలీస్ బాస్‌గా గౌతమ్ సవాంగ్ లేరు కానీ.. ఆయన చేసిన కామెంట్స్ మాత్రం సరిగ్గా ఈ సందర్భానికి సెట్ అవుతున్నాయ్.. తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చెప్పు విసిరిన వ్యక్తికి కూడా భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని సైలెంట్ అయిపోతారో లేకుంటే.. వైసీపీ చెప్పినట్లుగానే ఆదేశాలు పాటించి అరెస్ట్ చేసి రచ్చ చేస్తారో చూడాలి మరి.

Slippers-on-CM-YS-Jagan.jpg

సీఎం జగన్‌పై చెప్పు.. సిద్ధం రోడ్ షోలో ఊహించని పరిణామం

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 02:30 PM