Share News

CM Jagan: సీఎం జగన్‌పై చెప్పు.. సిద్ధం రోడ్ షోలో ఊహించని పరిణామం

ABN , Publish Date - Mar 30 , 2024 | 08:32 PM

అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సీఎం జగన్ తన వాహనంపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరారు.

CM Jagan: సీఎం జగన్‌పై చెప్పు.. సిద్ధం రోడ్ షోలో ఊహించని పరిణామం

అనంతపురం (Anantapur) జిల్లాలోని గుత్తి పట్టణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సీఎం జగన్ తన వాహనంపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. అయితే.. అది జగన్‌కి తగల్లేదు కానీ, ఆయనకు దగ్గర నుంచి వెళ్లింది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘వైనాట్ 175’ అంటూ ప్రచారం చేస్తున్న జగన్‌పై ఎంత వ్యతిరేకత ఉందో, ఈ ఘటనతో స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


సీఎం జగన్‌కి షాక్

మరోవైపు.. ఏపీ అసెంబ్లీ (AP Assembly Election 2024), లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls) ప్రచారాల్లో వలంటీర్ల సహాయంతో లబ్ది పొందాలనుకొని కుయుక్తులు పన్నిన అధికార వైసీపీకి ఎలక్షన్ సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. సంక్షేమ పథకాలకు చెందిన నగదు పంపిణీ నుంచి వలంటీర్లను నిషేధిస్తున్నట్టు పేర్కొంది. వలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు, టాబ్‌లు జిల్లా ఎన్నికల అధికారి వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతవరకూ.. ఆ యంత్రాలన్నీ డిపాజిట్‌లో ఉండాలని ఆదేశించింది. ‘సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ’ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 08:32 PM