Share News

Lok Sabha Polls: మోదీపై మరోసారి అజయ్ రాయ్ పోటీ..? ఈయన ఎవరంటే..?

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:44 PM

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన నేతలు బిజీగా ఉన్నారు. వారణాసి నుంచి మూడోసారి ప్రధాని మోదీ బరిలోకి దిగుతున్నారు. ఆయనపై మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలోకి దిగుతున్నారు. మోదీపై ముచ్చటగా మూడో సారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థుల పేర్లతో నాలుగో జాబితాను శనివారం నాడు విడుదల చేసింది. వారణాసి నుంచి మరోసారి అజయ్ రాయ్ బరిలోకి దిగనున్నారు. అజయ్ రాయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అతని రాజకీయ నేపథ్యం ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీతో కావడం విశేషం.

Lok Sabha Polls: మోదీపై మరోసారి అజయ్ రాయ్ పోటీ..? ఈయన ఎవరంటే..?

వారణాసి: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన నేతలు బిజీగా ఉన్నారు. వారణాసి నుంచి మూడోసారి ప్రధాని మోదీ (PM Modi) బరిలోకి దిగుతున్నారు. ఆయనపై మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ (Ajay Rai) బరిలోకి దిగుతున్నారు. మోదీపై (Modi) ముచ్చటగా మూడో సారి పోటీ చేస్తున్నారు. ఇంతకీ అజయ్ రాయ్ (Ajay Rai) ఎవరు..? అతని నేపథ్యం ఏంటీ..?

నేపథ్యం ఇదే..?

కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థుల పేర్లతో నాలుగో జాబితాను శనివారం నాడు విడుదల చేసింది. వారణాసి నుంచి మరోసారి అజయ్ రాయ్ బరిలోకి దిగనున్నారు. అజయ్ రాయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అతని రాజకీయ నేపథ్యం ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీతో కావడం విశేషం. 1991-92లో అజయ్ రాయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషిత్ కన్వీనర్‌గా పనిచేశారు. ఏబీవీపీ భారతీయ జనతా పార్టీకి చెందిన విద్యార్థి విభాగం అనే సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో గల కోసల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 1996 నుంచి 2007 వరకు మూడుసార్లు గెలుపొందారు. 2002లో బీఎస్పీ- బీజేపీ కూటమి ప్రభుత్వంలో అజయ్ రాయ్ మంత్రి పదవి చేపట్టారు.

బీజేపీకి గుడ్ బై

2007లో అజయ్ రాయ్ బీజేపీ నుంచి వారణాసి లోక్ సభ టికెట్ ఆశించారు. బీజేపీ హై కమాండ్ మాత్రం సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి టికెట్ ఇచ్చింది. దాంతో బీజేపీకి రాజీనామా చేశారు. సమాజ్ వాదీ పార్టీలో చేరి వారణాసి లోక్ సభకు పోటీ చేశారు. మనోహర్ జోషి చేతిలో ఓడిపోయారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిండ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2017లో మాత్రం ఓడిపోయారు. 2014 నుంచి కాంగ్రెస్ వారణాసి లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2014, 2019లో మోదీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి బరిలోకి దిగుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Holi: సియాచిన్‌కు రాజ్‌నాథ్ సింగ్.. సైనికులతో హోలీ సంబరాలు

Updated Date - Mar 24 , 2024 | 12:44 PM