Share News

Holi: సియాచిన్‌కు రాజ్‌నాథ్ సింగ్.. సైనికులతో హోలీ సంబరాలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 09:32 AM

ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెళ్లనున్నారు. అక్కడ భారత సైనికులతో హోలీ పండగ జరుపుకుంటారు. మైనస్ 20కి పైగా డిగ్రీలో చలిలో దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. హోాలీ పండగ సందర్భంగా సైనికులను కలుస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Holi: సియాచిన్‌కు రాజ్‌నాథ్ సింగ్.. సైనికులతో హోలీ సంబరాలు

ఏబీఎన్ ఇంటర్నెట్: ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వెళ్లనున్నారు. అక్కడ భారత సైనికులతో హోలీ పండగ జరుపుకుంటారు. మైనస్ 20కి పైగా డిగ్రీలో చలిలో దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. హోలీ పండగ సందర్భంగా ఆదివారం నాడు సైనికులను కలుస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

కారకోరం రేంజ్‌లో 20 వేల అడుగుల ఎత్తులో సియాచిన్ హిమానీనదం ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన మిలిటరీ జోన్‌గా పేరు గాంచింది. చలికాలంలో హిమపాతం, కొండ చరియలు విరిగిపడటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 1984 నుంచి ఇప్పటి వరకు 869 మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికుల కన్నా ఇది ఎక్కువ. 97 శాతం మరణాలు వాతావరణ ఇబ్బందుల వల్ల జరిగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 09:32 AM