Share News

Loksabha Elections: నాలుగోసారి వరుణ్‌కు నో..? ఇండిపెండెంట్‌గా బరిలోకి యువనేత..!!

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:23 PM

లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ బరిలోకి దిగుతారా..? భారతీయ జనతా పార్టీ మరోసారి టికెట్ ఇస్తోందా..? టికెట్ ఇవ్వకుంటే యువనేత వరుణ్ గాంధీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు పిలిభిత్ బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. వరసగా నాలుగోసారి వరుణ్ గాంధీకి టికెట్ దక్కడం ఖాయం అని అతని అనుచరులు ధీమాతో ఉన్నారు. ఒకవేళ టికెట్ లభించకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారని చెబుతున్నారు.

Loksabha Elections: నాలుగోసారి వరుణ్‌కు నో..? ఇండిపెండెంట్‌గా బరిలోకి యువనేత..!!

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ (Varun Gandhi) బరిలోకి దిగుతారా..? భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి టికెట్ ఇస్తోందా..? టికెట్ ఇవ్వకుంటే యువనేత వరుణ్ గాంధీ (Varun Gandhi) కార్యాచరణ ఎలా ఉండబోతుంది.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు పిలిభిత్ బీజేపీ (BJP) శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. వరసగా నాలుగోసారి వరుణ్ గాంధీకి (Varun Gandhi) టికెట్ దక్కడం ఖాయం అని అతని అనుచరులు ధీమాతో ఉన్నారు. ఒకవేళ టికెట్ లభించకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారని చెబుతున్నారు.

ఏం జరిగిందంటే..?

సంజయ్ గాంధీ- మేనకా గాంధీల కుమారుడే వరుణ్ గాంధీ (Varun Gandhi). సోనియా గాంధీతో పొసగకపోవడంతో మేనకా గాంధీ కాంగ్రెస్ పార్టీని వీడారు. కుమారుడితో పాటు మేనకా బీజేపీలో చేరారు. పిలిభిత్ లోక్ సభ నుంచి వరుణ్ గాంధీ వరసగా మూడుసార్లు బరిలోకి దిగారు. ఈ సారి టికెట్ దక్కడం కష్టమేనని తెలుస్తోంది. పార్టీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై వరుణ్ గాంధీ చేసిన కామెంట్ల వల్ల టికెట్ దక్కడంపై సందేహాలు తలెత్తాయి.

యోగిపై విమర్శలు

గత ఏడాది వరుణ్ గాంధీ యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు చేశారు. ‘రాష్ట్రంలో సాధువుకు ఆటంకం కలిగించొద్దు. మహారాజ్ జీ ముఖ్యమంత్రి అవుతారో ఎవరికీ తెలియదు. అమేథీలో గల సంజయ్ గాంధీ ఆస్పత్రిలో 2023 సెప్టెంబర్ నెలలో రోగి మరణించాడు. ఆస్పత్రి లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరును’ వరుణ్ గాంధీ తప్పుపట్టారు.

టికెట్ ఇవ్వొద్దు

సొంత ప్రభుత్వంపై వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. వరుణ్‌కు టికెట్ ఇచ్చే అంశం హైకమాండ్ చేతిలో ఉంది. టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ బరిలోకి దిగుతారని అతని సన్నిహితులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Lok Sabha Elections: అన్నాడీఎంకే తొలి జాబితా, డీఎండీకేతో పొత్తు

Updated Date - Mar 20 , 2024 | 03:23 PM