Share News

Lok Sabha Elections: అన్నాడీఎంకే తొలి జాబితా, డీఎండీకేతో పొత్తు

ABN , Publish Date - Mar 20 , 2024 | 02:54 PM

తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అన్నాడీఎంకే బుధవారంనాడు ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిసామి ఈ జాబితాను పార్టీ నేతల సమక్షంలో విడుదల చేశారు.

Lok Sabha Elections: అన్నాడీఎంకే తొలి జాబితా, డీఎండీకేతో పొత్తు

చెన్నై: తమిళనాడు (Tamilnadu) నుంచి లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Polls) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అన్నాడీఎంకే (AIADMK) బుధవారంనాడు ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిసామి (Edappadi K Palaniswami) ఈ జాబితాను పార్టీ నేతల సమక్షంలో విడుదల చేశారు.


డీఎండీకేతో పొత్తు

ఎన్నికల జాబితా విడుదల సమయంలో డీఎండీకేతో పొత్తును పళనిస్వామి ప్రకటించారు. పొత్తులో భాగంగా డీఎండీకే 5 స్థానాల్లో పోటీ చేయనుండగా, పుదియ తమిళగం, ఎస్‌డీపీఐలు చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ, తాము (అన్నాడీఎంకే) బలంగా ఉన్నామని నమ్ముతున్నామని, ప్రజల మద్దతు తమకే ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో ఎవరు ఏమనుకుంటున్నారో తాము పట్టించుకోమని, ప్రజలతోనే తమ అలయెన్స్ అని చెప్పారు.


16 మంది అభ్యర్థులతో తొలి జాబితా

అన్నాడీఎంకే తొలి జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. చెన్నై సౌత్ నుంచి జె.జయవర్దన, చెన్నై నార్త్ నుంచి రాయపురం మనోహర్, కాంచీపురం నుంచి ఇ.రాజశేఖర్, అరక్కోణం నుంచి ఏఎల్ విజయన్, క్రిష్ణగిరి నుంచి వి.జయప్రకాష్, అరని నుంచి జీవీ గజేంద్రన్, విల్లుపురం నుంచి జె.భాగ్యరాజ్, సేలం నుంచి పి.విఘ్నేష్, నమక్కల్ నుంచి ఎస్.తమిళ్‌మణి, ఈరోడ్ నుంచి అశోక్ కుమార్, కరూర్ నుంచి కేఆర్ఎల్ తంగవేల్, చిదంబరం నుంచి ఎం.చంద్రహాసన్, మధురై నుంచి పి.శరవణన్, థేని నుంచి వీటీ నారాయణసామి, విరుధునగర్ నుంచి పి.జయపెరుమాళ్, నాగపట్నం నుంచి జి.సూర్జిత్ శంకర్ పోటీ చేయనున్నారు. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 19న జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 39 సీట్లకు 38 సీట్లు గెలుచుకుని విజయభేరి మోగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 02:54 PM