Share News

Nupur Sharma: రాయ్ బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నుపుర్ శర్మ.. కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేనా..!!

ABN , Publish Date - Mar 19 , 2024 | 05:01 PM

2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

Nupur Sharma: రాయ్ బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నుపుర్ శర్మ.. కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేనా..!!

2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం బీజేపీ, మిత్రపక్షాలు ఒక్కో సీటుపై ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. జనాభా పరంగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ విజయం సాధించారు. 2004 నుంచి వరసగా ఎన్నికల్లో గెలుస్తున్నారు. కానీ ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఎన్నికలకు ముందే ఆమె రాజ్యసభకు వెళ్లారు. దీంతో బరేలీ భవితవ్యంపై దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి.

బీజేపీ అభ్యర్థిగా నుపుర్ శర్మకు ఈ స్థానంలో బీజేపీ టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నుపుర్ శర్మ గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నుపుర్ 31 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన డిబేట్ లో మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది పెను దుమారం రేపింది. తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆమెను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయం అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితుల నడుమ రాయ్‌బరేలీ నుంచి నుపుర్‌కు బీజేపీ టిక్కెట్ ఇస్తుందనే ఊహాగానాలు హాట్ టాపిక్ గా మారాయి.


గాంధీ కుటుంబానికి కంచు కోటగా భావిస్తున్న రాయ్ బరేలీలో కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థులు లేకపోవడంతో బీజేపీ అభ్యర్థి నుపుర్ శర్మ సునాయాసంగా విజయం సాధిస్తారనే అంచనాలు మొదలయ్యాయి. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన విడుదల కాలేదు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 05:01 PM