Share News

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:19 AM

రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

లక్నో: రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి (SP) గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిదో రాజ్యసభ సీటు కోసం భారతీయ జనతా పార్టీ (BJP) గట్టిగా ప్రయత్నిస్తోంది. ఎస్పీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఊహించినట్టుగా సోమవారం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇచ్చిన విందుకు 8 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆ వెంటనే మంగళవారం నాడు ( ఈ రోజు ) ఎస్పీ చీఫ్ విప్ మనోజ్ పాండే రాజీనామా చేశారు.

8 MLAs: రాజ్యసభ ఎన్నికలకు ముందే ఆ పార్టీకి షాక్.. అధినేత విందుకు హాజరు కానీ 8 మంది ఎమ్మెల్యేలు?

ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. బీజేపీ 7, ఎస్పీ 3 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఎనిమిదవ సీటు కోసం బీజేపీ 8 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. దీంతో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేసిందని ఎస్పీ ఆరోపిస్తోంది. క్రాస్ ఓటింగ్‌పై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆందోళన చెందుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు నిన్న జరిగిన సమావేశానికి రాకపోవడం అందుకు కారణమైంది. ఆ వెంటనే ఎస్పీ చీఫ్ విప్ రాజీనామా చేశారు. ‘ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థి గెలిచేందుకు ఎస్పీకి సంఖ్యా బలం లేదు. ఎనిమిది చోట్ల తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. సమాజ్ వాదీ పార్టీ ఇక సమప్త్ వాదీ పార్టీగా మారబోతుంది అని’ ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధ్వజమెత్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 11:19 AM