Share News

డాక్టర్‌ నుంచి కేంద్ర మంత్రిగా..

ABN , Publish Date - Jun 10 , 2024 | 05:04 AM

మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి.. గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు తొలి దఫాలోనే కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1976 మార్చి 7న తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన ఆయ న.. డాక్టర్‌గా అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు.

డాక్టర్‌ నుంచి కేంద్ర మంత్రిగా..

  • ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌కు గెలిచిన తొలిసారే జాక్‌పాట్‌

  • డాక్టర్‌ నుంచి కేంద్ర మంత్రిగా..

  • గుంటూరు ఎంపీగా గెలిచిన తొలిసారే జాక్‌పాట్‌

మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి.. గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు తొలి దఫాలోనే కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1976 మార్చి 7న తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన ఆయ న.. డాక్టర్‌గా అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. టీడీపీ ఎన్నారై విభాగంలో పనిచేశారు. జన్మభూమిపై మమకారంతో ప్రజలకు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రానికి వచ్చారు. టీడీపీ తరఫున గుంటూరు లోక్‌సభకు మొదటిసారి పోటీచేసి గెలిచారు. లోక్‌సభలో అత్యంత సంపన్నుడైన ఎంపీ (రూ.5,700 కోట్లు) ఈయనే కావడం విశేషం. మోదీ క్యాబినెట్‌లో అనూహ్యంగా సహాయ మంత్రిగా చోటు సంపాదించారు. 1996-98 నడుమ కేంద్రంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ క్యాబినెట్‌లలో నాటి టీడీపీ బాపట్ల ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రిగా పనిచేశారు.


మళ్లీ 28 ఏళ్ల తర్వాత టీడీపీ ఎంపీగా పెమ్మసానికి మంత్రి పదవి దక్కింది. కాగా, మోదీ నూతన కేబినెట్‌లో అందరికంటే సంపన్నుడు చంద్రశేఖరే. ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం పెమ్మసానికి రూ.5705 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. లోక్‌సభ బరిలో నిలిచిన అభ్యర్థులందరిలో అత్యంత ధనికుడు కూడా ఆయనే. ఇక, రూ484 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన జ్యోతిరాధిత్య సింధియా మంత్రివర్గంలో అత్యంత ధనికుల్లో పెమ్మసాని తర్వాతి స్థానంలో ఉన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 05:04 AM