Share News

MIM: దేశానికి బాబా మోదీ అవసరం లేదు.. ప్రధానిపై ఫైర్ అయిన ఓవైసీ..

ABN , Publish Date - Feb 11 , 2024 | 12:54 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు.

MIM: దేశానికి బాబా మోదీ అవసరం లేదు.. ప్రధానిపై ఫైర్ అయిన ఓవైసీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు. భారతదేశంలో ముస్లింల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిర్దిష్టమైన మతం ఉందా అని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ తీర్మానంపై ప్రధాని మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. రాముడిపై తనకు అత్యంత గౌరవం ఉందని, 'హే రామ్' అని చివరి మాటలు చెప్పిన వ్యక్తిని నాథూరామ్ గాడ్సే హత్య చేశారని, అలాంటి వ్యక్తిని తాను ద్వేషిస్తున్నానని తెలిపారు.

"నేడు, భారతదేశంలోని 17 కోట్ల మంది ముస్లింలు తాము పరాయివాళ్లం అనే భావనకు గురవుతున్నారు. ఈ దేశానికి 'బాబా మోదీ' అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వానికి సొంత మతం ఉందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలి. రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పు భారతదేశ లౌకికవాదాన్ని చాటిచెప్పింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఒక మతం మరో మతం సాధించిన విజయానికి గుర్తుగా ఉద్దేశించబడిందా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి." అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 12:54 PM