Share News

Kejriwal: నవరాత్రి ప్రసాదంగా ఆలూపూరీ మాత్రమే తిన్నారు.. ఈడీ ఆరోపణలపై స్పందన ఇదే..

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:50 PM

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.

Kejriwal: నవరాత్రి ప్రసాదంగా ఆలూపూరీ మాత్రమే తిన్నారు.. ఈడీ ఆరోపణలపై స్పందన ఇదే..

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు. కేజ్రీవాల్ ( Kejriwal ) తన షుగర్ లెవెల్స్‌ను ఉద్దేశపూర్వకంగా పెంచేందుకు మామిడిపండ్లు, ఆలూ-పూరీ, పంచదార తింటున్నారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దీనిపై స్పందించిన సింఘ్వీ నవరాత్రి ప్రసాదంగా కేజ్రీవాల్ ఒక్కసారి మాత్రమే ఆలూ-పూరీని తిన్నారని వెల్లడించారు. టీలో చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. బెయిల్ పొందడానికి అరవింద్ కేజ్రీవాల్ పక్షవాతం వచ్చే ప్రమాదం లేదని వివరించారు.


Elections 2024: ప్రశాంతంగా పోలింగ్.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంత నమోదైందంటే..

కేజ్రీవాల్ పై ఈడీ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని న్యాయవాది అన్నారు. వారి మాటలు పూర్తి అవాస్తవాలు అని పేర్కొన్నారు. తనకు ఇన్సులిన్ అందించే విషయంలో తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం కారణాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం విమర్శలు చేసిన విషయం తెలిసిందే.


Crime News: శివునిపై అనుచిత వ్యాఖ్యలు.. కోర్టు కీలక నిర్ణయం..

అరవింద్ కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. తీహార్ జైలులో ఉన్న ఆయనకు డాక్టర్లు ఇన్సులిన్ ఇవ్వలేదు. ఏప్రిల్ 8 తర్వాత మామిడి పండ్లు పంపలేదు. వాటి చక్కెర స్థాయి (గ్లైసెమిక్ ఇండెక్స్) బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ కంటే చాలా తక్కువ అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 06:04 PM