Share News

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుచేస్తే దేశం దివాళా తీయడం ఖాయం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

ABN , Publish Date - May 18 , 2024 | 05:48 PM

కాంగ్రెస్ చెబుతున్న మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే భారత్ దివాళా తీయడం ఖాయమని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Polls 2024)ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలో పర్యటించారు.

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుచేస్తే దేశం దివాళా తీయడం ఖాయం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

ముంబయి: కాంగ్రెస్ చెబుతున్న మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే భారత్ దివాళా తీయడం ఖాయమని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Polls 2024)ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలో పర్యటించారు.

ప్రతిపక్ష ఇండియా కూటమి ముంబయికి నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని మావోయిస్టుతో పోల్చిన ఆయన.. దాన్ని అమలు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పతానావస్థకు చేరుతుందని చివరకు భారత్ దివాళా తీస్తుందని విమర్శించారు.


"మనుగడే కష్టంగా మారిన కాంగ్రెస్ ఇష్టానుసారంగా హామీలు ఇస్తోంది. దేవాలయాల్లో బంగారం, మహిళల మెడలో మంగళసూత్రాలపై ఆ పార్టీ కన్ను పడింది. 50 శాతం వారసత్వ పన్ను విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రజల ఆస్తిని ఎక్స్ రే తీసి, ఓట్ జిహాద్ గురించి మాట్లాడే వారి ఓటు బ్యాంకుకు అప్పగిస్తోంది. పది సంవత్సరాల పాలనకాలానికి సంబంధించిన రిపోర్ట్ కార్డు, 25 సంవత్సరాల దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం నా వద్ద ఉన్న ప్రణాళికలు ఒక వైపు, పదుల సంఖ్యలో ప్రధాని అభ్యర్థులు ఉన్న ఇండియా కూటమి మరో వైపు నిలబడ్డాం. ప్రజలు ఎటు వైపు ఉండాలో ఇప్పటికే తేల్చేశారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్ముూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దైనా అతి కష్టంతో కూడుకున్న పనులు. వాటిని మా హయాంలో పూర్తి చేయగలిగాం. ఇవన్ని మీ విలువైన ఓటుని సరైన నాయకత్వానికి అప్పగించడం వల్లే అయ్యాయి. మరోసారి బీజేపీ సర్కార్‌ని ఆశీర్వదించండి" అని ప్రధాని మోదీ ఓటర్లను కోరారు.

Read National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 05:53 PM