Share News

Amith Shah: దేశంలో సమసిపోనున్న మావోయిస్టు సమస్య

ABN , Publish Date - May 26 , 2024 | 02:57 PM

రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతి‌నాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్‌లో ‘వారి’ జాడలే లేవన్నారు.

Amith Shah: దేశంలో సమసిపోనున్న మావోయిస్టు సమస్య
Amith Shah

న్యూఢిల్లీ, మే 26: రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతి‌నాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్‌లో ‘వారి’ జాడలే లేవన్నారు.

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

కానీ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలో మినహా దేశంలో మరెక్కడ మావోయిస్టుల సమస్య లేదని చెప్పారు. అయితే గత అయిదేళ్లు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్లే.. ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించ లేకపోయామన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కొలువు తీరిన.. ఈ అయిదునెలల్లో మావోయిస్టుల సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు.


ఆ క్రమంలో ఆ రాష్ట్రంలో మావోయిస్టులు.. ఎదురు కాల్పుల్లో ఎంత మంది మరణించారో, ఎంత మంది అరెస్ట్ అయ్యారో.. ఎంత మంది లోంగిపోయారో.. అన్నీ గణాంకాలతో సహా అమిత్ షా వివరించారు. అలాగే కేంద్రంలో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ సమస్య ఎలా ఉంది.. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఈ సమస్య ఎలా ఉందనే విషయాన్ని అమిత్ షా సోదాహరణగా విశదీకరించారు.

Telangana: ఇది రింగ్ కాక మరేమిటి..?

అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం అమిత్ షా ఈ సందర్బంగా వివరించారు. ఇక ఝర్ఖండ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో సైతం మావోయిస్టులే లేరని అమిత్ షా స్పష్టం చేశారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 03:00 PM