Share News

LokSabha Elections: ఓటర్లకు ప్రియాంక, రాహుల్ సూచన

ABN , Publish Date - May 26 , 2024 | 05:48 PM

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్.. జూన్ 1వ తేదీన జరగనుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తం కానుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ.. ఎవరికి వారు తమ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

LokSabha Elections: ఓటర్లకు ప్రియాంక, రాహుల్ సూచన

న్యూడిల్లీ, మే 26: సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్.. జూన్ 1వ తేదీన జరగనుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తం కానుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ.. ఎవరికి వారు తమ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం పంజాబ్‌లోని పతేఘర్ సాహెబ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మోదీ ప్రభుత్వంపై మాటలతో ఆమె దాడి చేశారు.

Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!


AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

దేశంలో 70 కోట్ల నిరుద్యోగ యువత ఉందన్నారు. గత 45 ఏళ్లలో ఇదే అత్యధికమని ఆమె గుర్తు చేశారు. అలాగే ఈ మోదీ ప్రభుత్వం హయాంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదని మండిపడ్డారు.

దేశంలో ప్రజా సమస్యలపై స్పందించే పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని ఈ సందర్బంగా ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని ప్రియాంక గాంధీ తెలిపారు.


Telangana: ఇది రింగ్ కాక మరేమిటి..?

ఇక దేశంలో నగదు లేదని ప్రధాని మోదీ అంటుంటారని.. కానీ ప్రజల కోసం పథకాలు తీసుకు వస్తామని చెబుతారన్నారు. మరోవైపు తన బిలియనీర్ స్నేహితుల చేసిన రూ.16 లక్షల కోట్ల రుణాన్ని సైతం ప్రధాని మోదీ మాఫీ చేశారని ఈ సందర్బంగా ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. అంటే నరేంద్ర మోదీ వద్ద ఉన్న నగదు బిలియనిర్ స్నేహితులకు ఇచ్చేందుకు ఉంటుంది కానీ.. రైతులకు ఇవ్వడానికి మాత్రం ఉండదని వ్యంగ్యంగా అన్నారు.

ఈ నరేంద్ర మోదీ ప్రదానిగా.. రైతులకు, నిరుద్యోగులకు ఏం చేయాలని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తుది దశ పోలింగ్‌‌ వేళ చాలా బాగా ఆలోచించి.. పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లకు ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ సూచించారు.


Amith Shah: దేశంలో సమసిపోనున్న మావోయిస్టు సమస్య

ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోని నహన్‌లో ఆదివారం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉందని.. ఈ విషయాన్ని మాత్రం బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో విపత్తు సంభవించిందని.. ఈ నేపథ్యంలో రూ. 9 వేల కోట్లు కావాలని మోదీ సర్కార్‌ను ఈ రాష్ట్ర ప్రభుత్వం విజ్జప్తి చేసినా.. స్పందించలేదని విమర్శించారు.

రాజ్యాంగం ద్వారానే హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైందని ఈ సందర్బంగా రాహుల్ గుర్తు చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని రక్షించేందుకు నేడు యుద్దం జరుగుతుందని ప్రజలకు రాహుల్ తెలిపారు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ స్థానాలకు.. తుది దశ పోలింగ్‌ జూన్ 1వ తేదీన జరగనుంది.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 05:49 PM