Share News

Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!

ABN , Publish Date - May 26 , 2024 | 04:43 PM

సార్వత్రిక ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్‌లో ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీంతో రాష్ట్రంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ క్రమంలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగే అవకాశముంది.

Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!
CEC Rajiv Kumar

న్యూఢిల్లీ, మే 26: సార్వత్రిక ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్‌లో ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీంతో రాష్ట్రంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ క్రమంలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగే అవకాశముంది. అయితే జమ్ము కశ్మీర్‌లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి రావడంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదివారం న్యూఢిల్లీలో స్పందించారు.

Amith Shah: దేశంలో సమసిపోనున్న మావోయిస్టు సమస్య

ఓటింగ్ శాతం పెరగడంతో జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి తొందరగా ఎన్నికలు నిర్వహించాలన్నట్లుగా సంకేతాలు కనిపించాయన్నారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా ప్రజలు చేరుకోవడం తమను సైతం ఉత్సహపరిచిందని చెప్పారు. ఇక యువత, పెద్దలు, ప్రజలు ఇలా అందరు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనేందుకు పోలింగ్ కేంద్రాలకు సంతోషంగా తరలి వచ్చారని పేర్కొన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు భాగస్వామ్యమైనట్లు స్పష్టమైందని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు.


Telangana: ఇది రింగ్ కాక మరేమిటి..?

మరోవైపు 2024 సెప్టెంబర్ లోపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గతంలో కోరింది. అయితే లోక్‌సభ ఎన్నికలతో సమాంతరంగా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు గల కారణాలను సైతం ఆయన అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణగా వివరించారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన అనంతరం జమ్ము కశ్మీర్ ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీ తర్వాత ఎప్పుడైనా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నాయన్నది సుస్పష్టం.


AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

ఇంకోవైపు 2014, డిసెంబర్‌లో మొత్తం 87 స్థానాలున్న జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, ఎన్‌సీ 15, కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. ఆ క్రమంలో బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2018లో ఈ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఇక 2019 ఆగస్టులో జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ క్రమంలో జమ్ము కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్‌ను మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వచ్చారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగే ఎన్నికల్లో సైతం ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే వస్తారనే అభిప్రాయం అయితే సర్వత్ర వ్యక్తమవుతుంది.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 04:43 PM