Share News

CM: షుగర్ వ్యాధికి ఇక వీడ్కోలు..!! సీఎం ఫొటోతో ఫేక్ వీడియో, వైరల్

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:08 AM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రేస్ గార్సియా ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో వీడియోను పోస్ట్ చేశారని గుర్తించారు.

CM: షుగర్ వ్యాధికి ఇక వీడ్కోలు..!! సీఎం ఫొటోతో ఫేక్ వీడియో, వైరల్

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో (Video) డీప్ ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రేస్ గార్సియా ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో వీడియోను పోస్ట్ చేశారని గుర్తించారు. ఐపీసీ, ఐటీ యాక్ట్స్ కింద బాధ్యులపై కేసు నమోదు చేశారు.

ఆ వీడియోలో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కనిపిస్తారు. యోగి వాయిస్‌కు అనుకూలంగా తమ గొంతును చేర్చారు. దేశం నుంచి షుగర్ వ్యాధికి వీడ్కోలు చెబుతాం. డయాబెటిస్‌కు గుడ్ బై చెబుదామని వీడియో పైన గల థంబ్ నెయిల్ మీద రాసి ఉంది. 41 సెకన్ల నిడివి గల ఆ వీడియో ఫిబ్రవరి 26వ తేదీన ఫేస్ బుక్ ప్రొఫైల్ గ్రేస్ గర్షియా పేరుతో అప్ లోడ్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ కనిపించడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికే దానిని 2.25 లక్షల చాలా సార్లు చేశారు. 120 సార్లు షఏర్ చేశారు.

యోగి ఆదిత్యనాథ్ పాత వీడియోను తీసుకొని ఏఐ సాయంతో వీడియోకు అనుగుణంగా వాయిస్ ఇచ్చారు. తమ వెబ్ సైట్ ద్వారా డయాబెటిస్‌కు సంబంధించిన మందులు కొనుగోలు చేయాలని దుండగులు కోరారు. ఆ ఔషధాలను భారత శాస్త్రవేత్తలు రూపొందించారని పేర్కొన్నారు. తమ మందులను వాడితే రోగం నయం అవుతుందని, మంచి జరుగుతోందని రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 11:08 AM