Share News

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:17 PM

టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు. తీరా టీసీకి గానీ టీటీకి గానీ దొరికితే తప్పించుకునేందుకు రకరకాల సాకులు చెబుతుంటారు. సరిగ్గా కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. టిక్కెట్ అడిగాడనే కోపంతో టీటీని కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తి తోసేశాడు. ఈ ఘటన కేరళ( Kerala ) లో మంగళవారం రాత్రి జరిగింది. ఎర్నాకులం-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో టీటీగా వినోద్ విధులు నిర్వహిస్తున్నారు. స్లీపర్ కోచ్ ఎస్11లో ప్రయాణికుల దగ్గర టికెట్లు చెక్ చేస్తున్న సమయంలో రజినీకాంత్ ను గుర్తించాడు. టిక్కెట్ చూపించాలని కోరాడు. దానికి రజినీకాంత్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్రం కోపంతో రజినీకాంత్ వినోద్ ను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు.

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. జైలు నుంచి ఆప్ ముఖ్య నేత విడుదల..

వెంటనే అలర్ట్ అయిన కోచ్‌లోని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. రైలు నుంచి పడిపోవడంతో వినోద్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఎర్నాకుళంకు చెందిన వినోద్ ఈరోడ్ వరకు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. టీటీఈని చంపాలనే ఉద్దేశంతో రైలు నుంచి తోసేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. టికెట్ తీసుకోకుండా ప్రయాణించి జరిమానా కట్టేందుకు ఇష్టపడకపోవడమే హత్యకు కారణమన్నారు.

Supreme Court: తగినంత సమయం ఇస్తాం.. అందరి వాదనలు వింటాం.. సుప్రీంకోర్టు..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 02:17 PM