Share News

Kejriwal: మా నాయకుడిని జైలులో పెట్టారు.. మేము హోలీ ఆడము.. అతిశి కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:10 PM

దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.

Kejriwal: మా నాయకుడిని జైలులో పెట్టారు.. మేము హోలీ ఆడము.. అతిశి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని ప్రతి నాయకుడు దుర్మార్గం, క్రూరత్వం, అన్యాయంపై రేయింబవళ్లు పోరాడుతున్నారని చెప్పారు. ఈ యుద్ధంలో తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ, దేశం కోసం మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 9 సార్లు సమన్లు పంపారు. అయినా కేజ్రీవాల్ వాటిని పట్టించుకోలేదు. దీంతో కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు రెండు గంటల పాటు విచారణ జరిపి సీఎం ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత మార్చి 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉంటున్నారు.


ఎన్నికల కోసం ఇండియా కూటమిలో చేరిన ఆప్ మిత్ర పక్షాలతో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ పరిణామాల నడుమ కేజ్రీవాల్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రతిపక్ష పార్టీలన్నీ మార్చి 31 ఉదయం 10 గంటలకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెగా ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు దిల్లీలోని రాంలీలా మైదానం వేదిక కానుంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 03:34 PM