Share News

BJP-AAP: బీజేపీలో చేరకుంటే నన్నూ అరెస్టు చేస్తారు.. కాక రేపుతున్న అతిశీ కామెంట్స్..

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:34 PM

దిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్టు చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) నూ అరెస్టు చేసింది. కస్టడీ కోసం తీహార్ జైలుకూ తరలించింది.

BJP-AAP: బీజేపీలో చేరకుంటే నన్నూ అరెస్టు చేస్తారు.. కాక రేపుతున్న అతిశీ కామెంట్స్..

దిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్టు చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) నూ అరెస్టు చేసింది. కస్టడీ కోసం తీహార్ జైలుకూ తరలించింది. అయినా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్ నేత అతిశీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీలో చేరకుంటే తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను అరెస్టు చేసే అవకాశం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నివాసాల్లో త్వరలోనే ఈడీ దాడులు జరుగుతాయని, అనంతరం తమను అదుపులోకి తీసుకుంటారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.

Viral Video: చెమటలు పట్టించిన చిరుత.. ఇళ్ల పై కప్పు నుంచి దూకుతూ.. వీడియో వైరల్..

"అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ పడిపోతుందని బీజేపీ ఊహించింది. కానీ రాంలీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవడాన్ని చూసి వారు భయపడ్డారు. త్వరలోనే మాకు సమన్లు​జారీ చేస్తారు. ఆపై జైల్లో పెడతారు. అయినా మేము బీజేపీకి భయపడటం లేదు. మా చివరి శ్వాస వరకు కేజ్రీవాల్‌తోనే పోరాడతాం. అందరినీ జైలులో పెట్టండి. అక్కడి నుంచే మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం."

- అతిశీ, దిల్లీ మంత్రి


India - China: మీ ఇంటి పేరు మార్చితే అది నాది అవుతుందా.. చైనాకు జై శంకర్ కౌంటర్..

బీజేపీలో చేరాలని తనకు సంప్రదింపులు వచ్చాయని, ఈ పని చేసి రాజకీయ జీవితాన్ని కాపాడుకోవచ్చని పలువురు ఆఫర్ చేశారని అతిశీ చెప్పారు. ఇప్పటికే సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ను జైలులో వేసిన బీజేపీ త్వరలోనే మిగతా నాయకులపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా.. మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 01:39 PM