Share News

AP Elections: జగన్‌పై దాడికి అసలు కారణం అదేనా.. వాళ్లకు ముందే తెలుసా..!

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:56 AM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు రోజులు అవుతుంది. ఇప్పటివరకు నిందితులు ఎవరో తెలియలేదు. అనుమానితుల పేరుతో కొందర్ని విచారిస్తున్నారు. సీఎం అంటే జడ్ ప్లస్ భద్రత.. ముఖ్యమంత్రి (CM) చుట్టూ పోలీసులు.. ఆయన పర్యటిస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ముందే తమ అధీనంలోకి తీసుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో భవనాలను క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేస్తారు. బయట వ్యక్తులు సీఎంపై దాడి చేయడం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా ఆకతాయిలు రాయి విసిరితే అది గాయం చేసేలా తగిలే అవకాశాలు చాలా తక్కువ. గత రెండు రోజుల్లో..

AP Elections: జగన్‌పై దాడికి అసలు కారణం అదేనా.. వాళ్లకు ముందే తెలుసా..!
CM YS Jagan

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు రోజులు అవుతుంది. ఇప్పటివరకు నిందితులు ఎవరో తెలియలేదు. అనుమానితుల పేరుతో కొందర్ని విచారిస్తున్నారు. సీఎం అంటే జడ్ ప్లస్ భద్రత.. ముఖ్యమంత్రి (CM) చుట్టూ పోలీసులు.. ఆయన పర్యటిస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ముందే తమ అధీనంలోకి తీసుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో భవనాలను క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేస్తారు. బయట వ్యక్తులు సీఎంపై దాడి చేయడం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా ఆకతాయిలు రాయి విసిరితే అది గాయం చేసేలా తగిలే అవకాశాలు చాలా తక్కువ. గత రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై కొందరు ఆకతాయిలు లేదా ఎవరైనా ప్రోద్భలంతో రాయి విసిరారు. అదృష్టవశాత్తు రాయి తగలకపోవడంతో పెద్ద గాయాలు కాలేదు. రాయి విసిరిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. విపక్ష నేతలపై రాళ్లు విసిరిన వ్యక్తులు గంటల వ్యవధిలో దొరికేశారు. కానీ ఓ సీఎంపై రాయి విసిరిన వాళ్లు ఇప్పటివరకు దొరకలేదంటేనే దీనిపై అనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకతాయిలు రాయి విసిరితే సెన్సేషనల్ కోసం విసురుతారు తప్పా.. ఇతర వ్యక్తికి గాయం చేయాలనే ఉద్దేశంతో విసరరు. ఎవరైనా టార్గెట్ చేస్తే తీవ్ర గాయమవుతుంది. అలా కాకుండా సినిమాల్లో అయితే ప్లాన్ ప్రకారం చేస్తారు.. దాంతో ఎక్కడ కావాలంటే అక్కడ దెబ్బ తగులుతుంది. సీఎం జగన్‌పై రాయి దాడి ప్లాన్ ప్రకారం చేయించుకున్నదా అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది.

CM Jagan: జగన్ యాత్రలు.. జనానికి తిప్పలు..


బాధ్యత మరిచి..

సీఎం జగన్‌పై రాయి దాడిని ఏ ఒక్కరూ సమర్థించే అంశం కాదు. అదే సమయంలో నిందితులను పట్టుకుని వారికి న్యాయస్థానాల ద్వారా తగిన శిక్ష పడేలా చేయాలి. ఆ బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. కానీ దాడి తర్వాత జగన్ లేదా వైసీపీ నేతల తీరు చూస్తుంటే బాధ్యత మరిచి.. రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన అరగంట వ్యవధిలోనే ఫ్లెక్సీలు, బ్యానర్లతో వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చారు. అంటే జగన్‌పై ఎవరో కావాలనే దాడి చేశారు.. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడికి పాల్పడ్డారనే కోణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజంగా జగన్‌పై ఎవరైనా కుట్ర ప్రకారం దాడి చేస్తే రాయితో దాడి చేయరు. పెద్ద ఆయుధాలతోనే దాడి చేసే అవకాశం ఉంటుంది. చిన్న రాయితో దాడి చేసినా.. పెద్ద ఆయుధంతో చేసినా హత్యయత్నమే అవుతుంది. కాబట్టి జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి జరిగిన దాడిగా బావించడానికి వీలులేకపోవచ్చు.


ముందే తెలుసా..

దాడి జరిగిన క్షణాల్లో వైసీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. సాధారణంగా ఏదైనా ఘటన జరిగిన తర్వాత ఏదైనా ఆందోళన చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఎక్కడెక్కడో ఉన్న కార్యకర్తలు ఒక దగ్గరకు చేరడానికి కొంత టైమ్ పడుతుంది. కానీ జగన్‌పై రాయి విసిరిన క్షణాల్లో.. వైసీపీ నాయకులు ఫ్లకార్డులు, జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. అంటే దాడి జరుగుతుందని పార్టీ నాయకులకు ముందే తెలిసి.. అవ్వన్నీ ప్లాన్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటిరవకు ఈ ఘటలనపై పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఓ సీఎంపై రాయి విసిరిన వ్యక్తిని పట్టుకోవడానికి ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారనేది ప్రజలకు అర్థం కావడంలేదు. ఇప్పటికైనా పోలీసులు విచారణను వేగవంతం చేసి నిందితులను పట్టుకోవల్సిన అవసరం ఉంది. అసలు ఎవరైనా ఆకతాయిలు రాయి విసిరారా లేదా కావాలని ప్లాన్ ప్రకారమే దాడి చేయించుకున్నారా అనే వాస్తవాలను పోలీసులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 10:57 AM