Share News

Ap Elections: రిగ్గింగ్ చేస్తున్న వంశీని పరిగెత్తించిన సూరంపల్లి యువత

ABN , Publish Date - May 26 , 2024 | 11:19 AM

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ భాగోతాలు ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో గన్నవరం మండలం సూరంపల్లి, ముస్తాబాద్, కేసరపల్లి మేజర్ పంచాయతీల్లో ఆయన ఓట్ల రిగ్గింగుకు ప్రయత్నించారు. దీన్ని కూటమి శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

Ap Elections: రిగ్గింగ్ చేస్తున్న వంశీని పరిగెత్తించిన సూరంపల్లి యువత
Vallabhaneni Vamsi

కృష్ణాజిల్లా మే 26: గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ భాగోతాలు ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో గన్నవరం మండలం సూరంపల్లి, ముస్తాబాద్, కేసరపల్లి మేజర్ పంచాయతీల్లో ఆయన ఓట్ల రిగ్గింగుకు ప్రయత్నించారు. దీన్ని కూటమి శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. సూరంపల్లిలో తెదేపా కూటమికి ఓట్లు బాగా పడుతున్నాయనే సమాచారంతో వంశీ తన అనుచరులతో గొడవకు దిగారు. దీంతో తెదేపా శ్రేణులు, గ్రామస్థులు ఆయన్ను అడ్డుకున్నారు. కూటమి నేతలు పెద్దఎత్తున చేరుకుని ఆయన్ని పరిగెత్తించారు. గతంలో అదే గ్రామానికి చెందిన మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు ఆస్తులపైనా వంశీ దాడి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.


కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఇంటిపైనా వంశీ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక యువత, గ్రామస్థులు ఆయన్ను పరిగెత్తించగా అది వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. తాజా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దారుణాలు బయటకు వస్తుండడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ నేతల బరితెగింపునకు అడ్డులేకుండా పోయిందని, చట్టాలు, న్యాయవ్యవస్థ పట్ల వారికి భయం లేదన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ భాగోతాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!

AP Elections: వైసీపీ నేతలు... యువతులతో అర్ధనగ్న డ్యాన్సులా? సిగ్గు సిగ్గు..!

Updated Date - May 26 , 2024 | 11:21 AM