Share News

AP Elections: వైసీపీ నేతలు... యువతులతో అర్ధనగ్న డ్యాన్సులా? సిగ్గు సిగ్గు..!

ABN , Publish Date - May 26 , 2024 | 09:09 AM

వైసీపీ శ్రేణుల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ప్రత్యర్ధి పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు దిగగా ఇప్పుడు యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు చేయిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారి తీరుపై మండిపడుతున్నారు.

AP Elections: వైసీపీ నేతలు... యువతులతో అర్ధనగ్న డ్యాన్సులా? సిగ్గు సిగ్గు..!
ycp leaders dances

నెల్లూరు మే 25: వైసీపీ శ్రేణుల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ప్రత్యర్ధి పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు దిగగా ఇప్పుడు యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు చేయిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారి తీరుపై మండిపడుతున్నారు.


మేకపాటి సోదరుల స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో వైసీపీ నేతలు యువతులతో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడం వైరల్‌గా మారింది. తిరునాళ్ల పేరుతో స్వామివారి రథోత్సవంలో వైసీపీ శ్రేణులు అపచారం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలకి తూట్లు పొడిచి నృత్యాలు చేయించారు. వారు ఎన్ని అరాచకాలు చేసినప్పుటికీ చట్టపరంగా సరైన చర్యలు లేకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.


దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ సందర్భంగా పలు గ్రామాల్లో తీవ్ర ఆంక్షలు విధించిన పోలీసులు.. మేకపాటి స్వగ్రామంలో మాత్రం మిన్నకుండిపోయారన్నారు. అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం... మిగిలిన వారందరికీ మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మేకపాటి సోదరులు, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Chandrababu: కాంబోడియాలో చిక్కుకున్న యువతను కాపాడాలి: చంద్రబాబు

Updated Date - May 26 , 2024 | 09:13 AM