Share News

Lok Sabha Election 2024: మనకా వీళ్లు హిందుత్వం నేర్పేది?.. మోదీకి మాస్ వార్నింగ్

ABN , Publish Date - May 09 , 2024 | 07:52 PM

మోదీ పాలన వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Lok Sabha Election 2024: మనకా వీళ్లు హిందుత్వం నేర్పేది?.. మోదీకి మాస్ వార్నింగ్
CM Revanth Reddy

హైదరాబాద్: మోదీ పాలన వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.


Free Bus Scheme: మహిళ తిట్లు.. డ్రైవర్ పాట్లు.. ఆగిపోయిన బస్సు!

ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య అని చెప్పుకొచ్చారు. తాము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లపై దాడి చేయాలని మోదీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం సంక్షోభంలో పడే సమయంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తుచేశారు.ఇందిరా మనమడు, సోనియా కొడుకు రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడడానికి తెలంగాణ గడ్డపైకి వచ్చి యుద్ధం ప్రకటించారని అన్నారు. తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ వైపు నిలబడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


‘‘రిజర్వేషన్లు కాపాడే పోరాటంలో మనమంతా రాహుల్‌తో కలిసి నడవాలి. 15 సెకన్ల సమయం ఇస్తే ముస్లింలను తుదముట్టిస్తామని బీజేపీ ఎంపీ అంటోంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మత సామరస్యం పెంపొందించాం కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు హైదారాబాద్‌కి వచ్చాయి. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం తిప్పికొట్టాలి. విశ్వనగరంలో బీజేపీ విషం చిమ్ముతోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా? మనకా వీళ్ళు హిందుత్వం నేర్పేది?.అక్షింతలు పంపి ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బీజేపీ మత ఉచ్చులో పడకండి.15 సెకన్లలో ముస్లింలను తుదముట్టిస్తామని చెప్పిన బీజేపీ ఎంపీ పై అమిత్ షా, మోదీ స్టాండ్ ఏంటో చెప్పాలి. మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడు’’ అని రేవంత్‌రెడ్డి మాస్ సెటైర్లు విసిరారు.

Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 08:21 PM