Share News

Lok Sabha Elections 2024: అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ మార్పింగ్ చేసింది: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Apr 28 , 2024 | 06:03 PM

సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

 Lok Sabha Elections 2024: అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ మార్పింగ్ చేసింది: కిషన్‌రెడ్డి
Kishan Reddy

హైదరాబాద్: సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (
Kishan Reddy)
అన్నారు. కాంగ్రెస్ (Congress) గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నాడు కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అమిత్ షా వ్యాఖ్యలను మార్పింగ్ చేయడంపై కేసు పెట్టామని ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇది ఆషామాహీ కేసు కాదని అన్నారు.

‘‘రేవంత్.. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయ్.. లేదంటే గద్దె దిగిపో తప్పయిపోయిందని లెంపలేసుకో. మీరిలాంటి అబద్ధాలు చెబితే నేను చూస్తూ ఊరుకోను. ఈ విషయంలో కాంగ్రెస్ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తోంది. లేని విషయాన్ని ఊహించి భ్రమకల్పిస్తోంది’’ అని కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Congress: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం సవాల్..

ఆ పార్టీ పరిస్థితి ఎంత దిగజారిందో ఈ విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ తొండి ఆట ఆడుతోందని విమర్శించారు. అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ అజెండా అని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. కానీ రాష్ట్రంలో బీసీలకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి రిజర్వేషన్లు వారికే దక్కాలంటే.. బీజేపీ వల్లే సాధ్యవుతుందని స్పష్టం చేశారు.రేవంత్‌కు ప్రచారంలో ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని విమర్శించారు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కూడా రేవంత్ చెప్పలేక పోతున్నారని ఆక్షేపించారు.కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా రేవంత్ చెప్పలేకపోతున్నారని అన్నారు.


రాహుల్ సమర్థ నాయకుడని చెప్పట్లేదని.. రాహుల్‌పై రేవంత్‌కు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సోనియాగాంధీ ఇటలీలో కాదు.. భారత్‌లో పుట్టిందని చెప్పలేకపోతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ జోడోయాత్ర చేస్తే.. అక్కడ కాంగ్రెస్‌కు ఎంతో మంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. కాంగ్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించేందుకు ఏ రకమైన అంశాలు దొరకట్లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కాంగ్రెస్, బీజేపీతో పోలిస్తే నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్.. బీజేపీపై పలు రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు వారిని నమ్మట్లేదన్నారు.


BJP: కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్

బీజేపీపై ఒక్కరూ కూడా అవినీతి ఆరోపణలు చేయలేదంటే తమ పాలన ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఏ రంగంలో అయినా మోదీ పాలనను తప్పుపట్టే అవకాశం లేకుండా అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. దుర్మార్గపు, అబద్ధపు, విష ప్రచారాలను కాంగ్రెస్ ప్రజలకు చెబుతోందని ఫైర్ అయ్యారు.రేవంత్‌కు కల వచ్చిందో.. రాహుల్‌కు కల వచ్చిందో.. తమ అజెండాను వారే చెబుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించి ఒక్క సాక్షాన్ని కూడా ఎందుకు చూపించట్లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను నీరుగార్చిందే కాంగ్రెస్ అని చెప్పారు.


మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్యా, వైద్యాన్ని అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందనే భయంలో కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి ఓట్లడగలేని పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు. రేవంత్.. ప్రమాణాలతో ప్రజలకు న్యాయం జరగదని ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఎక్కడా స్పందన రావట్లేదన్నారు. ఆ పార్టీపై అందరూ నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి ఓటు వేశామా? అని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.


KTR: ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం: కేటీఆర్‌

బీజేపీ అంటే.. ఒక వ్యక్తి కోసం, ఒక కుటుంబం కోసం పని చేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను మార్పింగ్ చేయడంపై కేసు పెట్టాం, ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇది ఆషామాషి కేసు కాదన్నారు. రేవంత్.. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. లేదంటే గద్దె దిగిపోవాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.ఆయన ఇలాంటి అబద్ధాలు చెబితే తాను చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఉద్దేశ్యం కాంగ్రెస్‌కే ఉందన్నారు. కాంగ్రెస్ ఏం చేసుకున్నా.. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.


బీజేపీ లేని చోట కూడా తెలంగాణలో తమ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. ఇది తెలిసే కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోహన్ భగవత్.. రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు జరగాలని కోరారని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని.. దీన్ని పటిష్ఠంగా అమలుచేయాలని ఆయన కోరారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అజెండాలో తాము పడదలుచుకోలేదన్నారు. ప్రజాసంఘాల నేతలను తాము అరెస్ట్ చేయలేదని తేల్చిచెప్పారు. రేవంత్ పేగులు మెడలో వేసుకుంటానని అంటున్నారని.. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యాననే భావన కొంత కూడా లేదని.. ఆయన ఏదైనా మాట్లాడగలరని కిషన్‌రెడ్డి సెటైర్లు గుప్పించారు.


Konda Visveshwar Reddy: మోదీ వేవ్‌ తెలంగాణలోనూ కనిపిస్తోంది: కొండా

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 06:16 PM