Share News

Lok Sabha Election 2024: నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. బీజేపీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

ABN , Publish Date - May 08 , 2024 | 10:22 PM

బీజేపీ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు దీక్ష చేసినప్పుడు వచ్చానని అన్నారు. వారు ఇచ్చిన సహకారంతో పీసీసీ అధ్యక్షుడినయ్యానని గుర్తుచేశారు. నిజామాబాద్ లోని ఆర్మూర్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Lok Sabha Election 2024: నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను..  బీజేపీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
CM Revanth Reddy

నిజామాబాద్: బీజేపీ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు దీక్ష చేసినప్పుడు వచ్చానని అన్నారు. వారు ఇచ్చిన సహకారంతో పీసీసీ అధ్యక్షుడినయ్యానని గుర్తుచేశారు. నిజామాబాద్ లోని ఆర్మూర్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014లో ఎమ్మెల్సీ కవిత 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చారని గెలిచిన తర్వాత మాట తప్పారని మండిపడ్డారు.


Komatireddy Venkatreddy: వచ్చే పదేళ్లు రేవంతే సీఎం.. జూన్ 5కి వారంతా కాంగ్రెస్‌లోకి..

మాట ఇచ్చి మోసం చేసిన కవితను 2019 ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. 2019లో ఒక తోండాయన బాండ్ పేపర్ రాసిచ్చారని.. ఈ విషయాన్ని నమ్మి కవితను బండకేసి కొట్టి గుండు(అరవింద్)ను గెలిపించారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లయినా పసుపు బోర్డును ఆయన ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు. ఆర్మూర్ కు శనిలా పట్టిన బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డిని ఓడించారని.. బీజేపీని గెలిపించారని అన్నారు. ఆ బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ కు ఏం తెచ్చారు? మోదీ నుంచి ఏం సాధించారు? అని ప్రశ్నించారు. స్వయంగా రైతు అయిన కాంగ్రెస్ నిజామాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతులకు ఆత్మ గౌరవం ఎక్కువ అని చెప్పారు. పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ రావాలంటే కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.


Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది

ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులకు రూ.500 బోనస్ ఇచ్చి కొంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 9 వ తేదీలోగా రైతుబంధు వేస్తానని సవాల్ చేశానని.. అయినా 6 వ తేదీ లోపు రైతులందరికీ డబ్బులు వేశామని చెప్పారు. కేసీఆర్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించి రా.. ముక్కు నేలకు రాయాలని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వేసిన సవాల్ ప్రకారం 15 ఆగస్టు నాడు రాజీనామా పత్రం తీసుకుని రావాలని చెప్పారు. సిద్ధులగుట్ట సాక్షిగా చెబుతున్నా..15 ఆగస్టు లోపల రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని మాటిచ్చారు. గత రెండు ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు, బీజేపీకి అవకాశం ఇచ్చారని.. ఈ ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ అభ్యర్థికి అహంకారం ఎక్కువ అని మండిపడ్డారు. ఈసారి రైతుబిడ్డ జీవన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.


ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి రూ.16 కోట్లు మంజూరు చేస్తానని మున్సిపల్ విలీన గ్రామాల సమస్యలు పరిష్కరిస్తానని మాటిచ్చారు. బీజేపీ నేతలు ప్రతి విషయంలో దేవుడి పేరు తీసుకు వస్తారని.. అక్షింతలు ఇస్తారని.. కానీ పెళ్లి కానిదే అక్షింతలు ఇస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాముడి ప్రతిష్ఠ కాక ముందే అక్షింతలు ఎలా వచ్చాయి? ఎలా పంచారని నిలదీశారు. ఇది దేవుడి పేరిట మోసం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని.. దేవుడిని, మనల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. వారే అసలైన హిందువు అని స్పష్టం చేశారు. రోడ్ల మీద దేవుడి బొమ్మలు పెట్టి ఓట్లు అడుక్కునే వారు బిచ్చగాళ్లేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

V.Hanumanthrao: మరోసారి మోదీ వస్తే... అదానీ, అంబానీలను కోటీశ్వరులను చేస్తారు తప్ప..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2024 | 10:50 PM